టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. తెలుగు ప్రేక్షకులు గర్వించే విధంగా ‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కించి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించాడు. తెలుగులో భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుని బాలీవుడ్ సినిమాల కలెక్షన్స్‌ను సైతం వెనక్కు నెట్టిన ‘బాహుబలి’ మేకర్ రాజమౌళి తన తర్వాత సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే ఆయన సినిమా ఎన్టీఆర్, చరణ్‌తో మల్టీస్టారర్ అని తేలిపోయింది, కాని ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. రాజమౌళి తన తర్వాత సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన సంక్రాంతి సందర్బంగా చేయబోతున్నారు. స్వయంగా రాజమౌళి ప్రెస్‌మీట్ పెట్టి ఆ విషయాన్ని మీడియాకు వెళ్లడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో సినిమా ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్, ఎప్పుడు విడుదల అనే విషయమై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని ఇప్పటికే అనధికారిక సమాచారం అందుతుంది. 2019 దసరా కానుకగా సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతూనే ఉంది. సంక్రాంతికి మెగా, నందమూరి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు జక్కన్న సిద్దం అవుతున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.