రెబల్‌ స్టార్‌ కష్టాలు కంటిన్యూస్‌

director sujeeth about prabhas sahoo film

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రం కోసం ఏకంగా అయిదు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ అయిదు సంవత్సరాలు మరే ప్రాజెక్ట్‌కు కమిట్‌ కాకుండా కేవలం రాజమౌళికే తన జీవితాన్ని అర్పించాడు. ఆ అయిదు సంవత్సరాల్లో ఆహారం, నిద్ర ఇలా అన్ని విషయాల్లో కూడా ప్రభాస్‌ చాలా కష్టపడ్డాడు. కొన్ని సార్లు చాలా అతిగా తినాల్సి వచ్చేది, కొన్ని సార్లు కడుపు మాడ్చుకునే పరిస్థితి, కొన్ని నెలల పాటు ప్రభాస్‌ రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రించేవాడట. ఇలా ‘బాహుబలి’ కోసం ప్రభాస్‌ అంతగా కష్టపడ్డాడు కనుకే ఆ స్థాయిలో స్టార్‌డంను దక్కించుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌ అంటే బాలీవుడ్‌లో స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు.

Prabhas-starrer-Sahoo

‘బాహుబలి’ కోసం దాదాపు అయిదు సంవత్సరాలు కష్టపడ్డ ప్రభాస్‌ కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణలో ప్రభాస్‌ గత నాలుగు నెలలుగా పాల్గొంటున్నాడు. బాహుబలి కోసం ఏ స్థాయిలో కష్టపడ్డాడో అంతకు ఇంకాస్త ఎక్కువే ప్రభాస్‌ ‘సాహో’ కోసం కష్టపడుతున్నాడు. తనపై ఉన్న అంచనాలను నిలుపుకునేందుకు, మరో సూపర్‌ హిట్‌ కోసం ప్రభాస్‌ కష్టపడుతూ ఉన్నాడు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సీన్స్‌ను ‘సాహో’లో చూపించేందుకు దర్శకుడు సుజీత్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

విభిన్నమైన నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటి వరకు సౌత్‌లో చూడని యాక్షన్‌ సీన్స్‌ చూస్తామని దర్శకుడు చెబుతున్నాడు. ఈ చిత్రం కోసం ప్రభాస్‌ మరో ఆరు నెలల పాటు కష్టాలు పడాల్సిందే అని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సాహో చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మిస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది.