చలికాలంలో ఆరోగ్యానికి దివ్య ఔషధం పసుపు టీ

Divine Medicine Is Yellow Tea For Health In Winter

రోజూ వంటల్లో విరివిగా వాడే పసుపు ఎంత ఆరోగ్యప్రదాయినో అందరికి తెలిసిన విషయమే. కొన్ని వందల ఏళ్లుగా మన భారతీయులు పసుపు ని ఒక దివ్య ఔషధంగా గుర్తించి, ప్రతి వంటలో వాడుతూ వస్తున్నారు. కుర్కుమిన గా పిలవబడే పసుపు రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా, గాయాలను మాన్పించే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గా, యాంటీ ఆక్సిడెంట్‌ గా కూడా ఉపయోగపడుతుంది. అధిక బరువుతో మరియు స్థూలకాయం తో బాధపడేవారికి పసుపు ఎంతగానో సహకరిస్తుంది. పసుపుని కూరల్లో వాడే ఒక దినుసుగా కాకుండా టీ చేసుకొని రోజూ తాగితే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. పసుపు యాంటీ ఆక్సిడెంట్‌ అవ్వడం వలన పసుపుతో చేసిన టీ తాగితే, కేన్సర్‌‌తో పోరాడడమే కాకుండా, కేన్సర్‌‌ కణాల విస్తరణని అడ్డుకొని, ట్యూమర్లు వంటి గడ్డల పెరుగుదలని కూడా అదుపులోకి తెస్తుంది.

yellow-tea

బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు రోజూ పసుపు టీ తాగడం వలన శరీరంలో ఉన్న కొవ్వు కరిగి, ఒబేసిటీ రాకుండా అడ్డుకుంటుంది. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు కూడా ఈ పసుపు టీ తాగడం వలన డయాబెటిస్ ని అదుపులో ఉంచుకోగలుగుతారు. ఆర్థరైటిస్ లక్షణాలతో బాధపడేవారికి కూడా పసుపు టీ ఒక దివ్య ఔషధమే.ఇన్ని ప్రయోజనాలను కలిగించే పసుపు టీ చేసుకోవడం చాల తేలిక. రెండు కప్పుల నీటికి, ఒక టీ స్పూన్ పసుపు పొడి ని కలిపి, సన్నని సెగ పైన వేడిచేయాలి. ఆ తరువాత కొన్ని నిముషాలు చల్లార్చాక తాగాలి. రుచి కోసం కొంచెం తేనె మరియు అల్లం కూడా కలుపుకోవచ్చు. ఈ చలికాలంలో పసుపు టీ తాగడం వలన చలికాలంలో దరిచేరే జలుబు, దగ్గు నుండి విముక్తి కూడా పొందొచ్చు.