దీపావళి పండుగ వచ్చేసింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సందడి మొదలైంది. పండుగ వేళ రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మొదట ఏపీలోని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఇక నిన్న తెలంగాణలోని విద్యాసంస్థలకు కూడా మూడు రోజులపాటు సెలవులు ఉండనున్నట్లు వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం రోజున అంటే 12వ తేదీన దీపావళి సెలవు ఉండగా.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దాన్ని సోమవారానికి మార్చేశాయి. దీంతో ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం కలిసి వచ్చాయి. ఈ నేపథ్యంలో 3 రోజులు అంటే శని , ఆదివారం అలాగే సోమవారం వరుసగా సెలవులు ఉండనున్నాయి. దీంతో విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు. అటు సోమవారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడనున్నాయి.