ఏది ఏమైనా ముందుగా వాటిని గ్రహించి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఆకలి వేయడం, ఎక్కువ సార్లు యూరిన్ వెళ్లడం, ఇరిటేషన్, నీరసం మొదలైన లక్షణాలు డయాబెటిస్ వలన వస్తాయి, వీటిని మనం ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. లేదంటే మరింత ఇబ్బందిగా మారిపోతాయి. అయితే డయాబెటిస్ కి మరి కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఓరల్ హెల్త్ సమస్యలు కూడా వస్తాయి. మీరు కనుక డయాబెటిస్ తో బాధ పడుతుంటే తప్పకుండా పంటి సమస్యలను రాకుండా చూసుకోవాలి అయితే ఇక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి. మరి వాటి కోసం ఇప్పుడు చూసేయండి.
టైప్ 2 డయాబెటిస్ లో మనం నోరు ఆరిపోవడంని గ్రహించవచ్చు. దీనినే xerostomia అని అంటారు. నోటిలో సలైవ తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీంతో ఎక్కువగా దాహం వేస్తుంది. అల్సర్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.పంటి నుండి కానీ దంతాలు నుండి కానీ రక్తం కారుతోందా..? అయితే డయాబెటిస్ లక్షణం అవ్వచ్చు. డయాబెటిస్ వలన పంటి నుండి లేదా దంతాలు నుండి రక్తం కారుతుంది. వీటిని కూడా సరైన సమయానికి చూపించుకోవాలి. లేదంటే మరింత ప్రమాదకరంగా మారుతాయి.
ఏది ఏమైనా షుగర్‌ని నెగ్లెట్ చేయద్దు. ఎప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవడం.. డాక్టర్ చెప్పిన డైట్ ని ఫాలో అవ్వడం, తినకూడని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వీలైనంత వరకూ ఆరోగ్యానికి మేలు కలిగే విధంగా ఫిజికల్ ఫిట్నెస్ మొదలైన వాటిపై దృష్టి పెట్టడం వలన షుగర్ సమస్య వలన కలిగే ఇబ్బందులకు దూరంగా ఉండచ్చు లేదు అంటే షుగర్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుసుకోండి.
బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళు పుచ్చిపోయే అవకాశం కూడా ఉంది. మన నోట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. అలానే పంటి పైన పాచి ఉంటుంది. అ పాచి లో ఉండే ఆసిడ్ పంటి ఎనామిల్ ని ఎఫెక్ట్ చేస్తుంది దీని కారణంగా పంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. పళ్ళు పుచ్చిపోయినప్పుడు కచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి లేదు అంటే నొప్పి ఎక్కువ కలగడం, ఇన్ఫెక్షన్స్ రావడం లేదా ఏకంగా పళ్ళు ఊడడం కూడా జరుగుతుంది.
ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ఎక్కువగా యాంటి బయోటిక్స్ తీసుకుంటూ ఉంటారు. యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ నుండి బయట పడవచ్చు. అయితే ఇలా ఎక్కువ యాంటీ బయోటిక్స్ తీసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎక్కువగా దీనిని మనం నోట్లో మరియు నాలుక మీద గమనించ వచ్చు. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే ..? నోట్లో తెలుపు రంగు లేదా ఎరుపు రంగు తో ఫ్యాచ్స్ లాంటివి ఉంటాయి. దీని వల్ల నొప్పి ఎక్కువ కలుగుతుంది. ఇవి పుండ్లు కింద కూడా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా ముందే గ్రహించి.. తగిన ట్రీట్మెంట్ చేయించుకోవాలి లేదు అంటే మరింత ఇబ్బందికరంగా మారిపోతుంది.
నోరు మరియు నాలుక పై మంట కూడా మనం గమనించవచ్చు. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేయకపోవడం కారణంగా ఈ సమస్య వస్తుంది. ఇది కూడా మనం తగ్గించుకోవాలి లేదు అంటే విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.ఇక డయాబెటిస్ ఎందుకు వస్తుంది అనేది చూస్తే… మనం తినే ఆహారంలో షుగర్ కూడా ఉంటుంది. అయితే మోతాదుకు మించి తీసుకుంటే శరీరం లో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇది నిజంగా కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
మనం తినే ఆహారం ద్వారా అదనపు చక్కెర కాలేయంలో నిల్వ ఉంటుంది. అయితే మనం శారీరకంగా శ్రమించినప్పుడు శరీరానికి అవసరమైన శక్తి షుగర్ ద్వారా లభిస్తుంది. కాలేయం లో ఉండే చక్కెర శరీరానికి వెళుతుంది. అయితే అది కొంత లిమిట్ వరకే ఉంచగలదు. అంత కంటే ఎక్కువ ఉంచలేదు అందుకనే అది ఏం చేస్తుందంటే… మిగిలిన చక్కెరని బయటకు పంపించేస్తుంది తరచు యూరిన్ వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా అది మధుమేహానికి సూచన అని గ్రహించాలి.
షుగర్ ఎందుకు వస్తుంది అనేది చూస్తే.. వివిధ కారణాల వలన షుగర్ వచ్చే అవకాశం వుంది. సరైన వేళలో భోజనం చేయకపోవడం, నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అలాగే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా షుగర్ వస్తుంది. అలానే శారీరక శ్రమ తగ్గడం వల్ల కూడా చిన్న వయసులోనే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఒక వేళ కనుక టైప్ 1 డయాబెటిస్ వచ్చింది అంటే… జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాలి అని గ్రహించండి. అదే విధంగా జీన్స్ పరంగా కూడా షుగర్ వస్తుంది. ఇది ఇలా ఉంటే చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది. బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉండాలి అని. అయితే బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉండాలి అనే విషయానికి వస్తే… ఉదయాన్నే బ్లడ్ టెస్ట్‌కి మధ్యాహ్నంకి ఈ నెంబర్ మారుతుంది.
ఒకవేళ మీకు రక్తంలో గ్లూకోజ్ స్థాయి పరగడుపున చేస్తే.. అప్పుడు వంద మిల్లీగ్రాముల లోపు ఉంటే మధుమేహం లేనట్టు.అదే ఒకవేళ 126 మిల్లీ గ్రాములు ఉంటే కచ్చితంగా షుగర్ ఉన్నట్టు. అదే ఒకవేళ భోజనం చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు 140 మిల్లీగ్రాముల నుండి 200 మిల్లీ గ్రాములు లోపు ఉంటే షుగర్ లేనట్టు. అదే 200 మిల్లీ గ్రాములు దాటిందంటే కచ్చితంగా షుగర్ ఉన్నట్టు. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ద్వారా షుగర్ కరెక్ట్ గా చెబుతుంది. కనుక దీనిని ఫాలో అయితే మంచిది.