ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసా ?

ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసా ?
Latest News

సినీ ఇండస్ట్రీలో ప్రతీ హీరో, హీరోయిన్ కి డ్రీమ్ రోల్ అనేది ఉంది . ఆ పాత్రలో నటిస్తే.. బాగుంటుంది అలాంటి అవకాశాలు వస్తే బాగుంటుందని వారు ఎంతగానో ఆరాపడుతు ఉంటారు . అలాంటి అవకాశాలు వస్తే.. వారు అసలు వదులుకోరనే చెప్పాలి. ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి కూడా ఈ విధమైన ఓ డ్రీమ్ రోల్ ఉందని తెలుస్తోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు గా తాను ఏంటో నిరూపించుకున్నారు.

ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసా ?
NTR

ఎలాంటి పాత్రలోనైనా తన అద్భుతమైన నటనతో పూర్తి న్యాయం చేస్తారు ఎన్టీఆర్ గారు . ఇలా స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఎప్పటి నుంచో ఈ పాత్రలో నటించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం కూడా ఇచ్చారు .

ఇప్పటివరకు అలాంటి పాత్రలో నటించే అవకాశం మాత్రం రాలేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటనే విషయానికి వస్తే.. ఎన్టీఆర్ తాతగారు నందమూరి తారకరామారావు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించారు. తన తాత గారిని కృష్ణుడి పాత్రలో చూసిన ఎన్టీఆర్ ఎంతో సంతోషపడేవారని సమాచారం. తానుకూడా ఇలాంటి పాత్రలో నటించాలని కోరుకునేవాడట. కృష్ణుడి వేషంలో కనిపించే పాత్రలు ఇప్పటివరకు అస్సలు రాలేదు. త్వరలో తెరకెక్కబోయే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి మహాభారతంలో ఎన్టీఆర్ కృష్ణుడిపాత్ర దక్కించుకుంటారో లేదో అనేది వేచి చూడాలి .