యంగ్ కేటీఆర్.. ఎలా ఉండేవారో తెలుసా?

Do you know how young KTR looks?

ఇప్పుడంటే కేటీఆర్ ఒక మాజీ మంత్రి.. సీఎం కేసీఆర్ కొడుకు.. ఆ గౌరవ మర్యాదలు ఎలాగూ ఉంటాయి. కానీ ఆయన కుర్రాడిలా ఉన్నప్పుడు కేటీఆర్ ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే ఆయన అలవాట్లు – అభిరుచులు అన్నీ ఓ సాధారణ యువకుడిలానే ఉండేవని ఒక్క ఫొటో తేల్చేసింది.

ఆ నాటి కుర్ర కేటీఆర్ ఎంత ఇస్మార్ట్ గా ఉండేవాడో చూడాలని అనుకుంటున్నారా అయితే చూసెయ్యండి. ఇండియాలోనే డిగ్రీ పూర్తి చేసిన ఆయన అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ (సీయూఎన్ వై)లో ఎంబీఏ మార్కెటింగ్ చేశారు.

ఆ తర్వాత న్యూయార్క్ మాడిసన్ లో ఉన్న ఓషియన్ లాజిస్టిక్ షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగం కూడా చేశారు. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు, ఒక ఈ పిక్ మీద కేటీఆర్ అభిమానులు – ఇతర ప్రముఖులు కామెంట్లు చేస్తున్నారు. ఈ పిక్ విపరీతంగా షేర్ చేస్తున్నారు.