కోడెలకి హార్ట్ ఎటాక్…పరిస్థితి విషమం 

Heart attack to Kodela ..situation is dangerous
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడం సంచలనంగా మారింది. నిన్న రాత్రి ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వత ఆయన్ని తన కుమార్తె ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన అల్లడు మనోహర్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ప్రభుత్వం మారాక కోడెల  పలు వివాదాల్లో చిక్కుకున్నారు.
ఆయన కుమారుడు, కుమార్తె మీద పలు వసూళ్ళ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వ్వహారం కొనసాగుతుండగానే అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం కోడెల మెడకు చుట్టుకుంది.
తాజాగా, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు మాయం చేశాడంటూ ఆయన మీద అంబతో ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. ఆరోపణలు రావడం, కేసుల వ్యవహారంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయి మధన పడుతుండగా అదే ఆయన గుండెపోటుకు కారణమని భావిస్తున్నారు