మంచు వారి డైనమిక్ హీరో మంచు విష్ణు హీరోగా చేస్తున్న తన డ్రీం ప్రాజెక్ట్ మూవీ “కన్నప్ప” కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రిలీజ్ మూవీ గా దీనిని ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు మూవీ శరవేగంగా పూర్తవుతుంది. అయితే రీసెంట్ గా వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా రాగా ఇండియా లోనే భారీ మల్టీస్టారర్ మూవీ గా ఇది రాబోతుంది.
అయితే ఈ మూవీ లో తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మరి శరత్ కుమార్ పై రీసెంట్ గానే ఒక లుక్ పోస్టర్ కూడా వచ్చి ఆకట్టుకుంది. అయితే ఇపుడు అసలు శరత్ కుమార్ పాత్ర ఏంటి ఎలా కనిపిస్తారు అనేది మరో ఇంట్రెస్టింగ్ లుక్ పోస్టర్ తో రివీల్ అయింది . ఈ మూవీ లో శరత్ కుమార్ “నాత నందుడు” గా కనిపించనున్నారు అని రివీల్ చేశారు.
అలాగే తాను పాండవ భీమ సేన, హిడింబిలకి వారసుడు కాగా కోయల ప్రజలకి నాయకుడుగా కనిపిస్తారని ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో మేకర్స్ రివీల్ చేశారు. మరి ఈ రోల్ మూవీ లో ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూడాలి. ఇక ఈ మూవీ ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కు రాబోతుంది.
Embark on the '#Kannappa' adventure with @realsarathkumar as '𝐍𝐚𝐭𝐡𝐚𝐧𝐚𝐝𝐡𝐮𝐝𝐮', leading the descendants of '𝙱𝚑𝚒𝚖𝚊 𝚂𝚎𝚗𝚊' and '𝙷𝚒𝚍𝚒𝚖𝚋𝚒', celebrated for their expertise in bow and arrows🏹🕉️#SarathKumar #Nathanadhudu #RaghuBabu #KannappaMovie… pic.twitter.com/TgP591InO5
— 24 Frames Factory (@24FramesFactory) July 22, 2024