బాలయ్య లయన్ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా ?

బాలయ్య లయన్ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా ?
Entertainment

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఆయన మూవీ టైటిల్స్ లో చాలా సెంటిమెంట్ ఉంటుంది. ప్రధానంగా సింహ అనే పదం ఉంటే ఆ మూవీ హిట్ అనే సంగతి దాదాపు అందరికీ తెలిసిందే. సీమసింహం మినహా మిగతా చిత్రాలన్నీ దాదాపు బాలయ్యకు బ్లాక్ బస్టర్ సినిమా సెంటిమెంట్ తో హిట్లుగా నిలిచాయి. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి మూవీ తో పాటు పాలిటికల్ కార్యక్రమాలతో బాగా బిజీగా ఉన్నారు. తాజాగా బాలయ్యకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. త్రీడీ సింహం బొమ్మ ఉన్న బ్యాగ్ ను ధరించి బాలయ్య ఆ వీడియోలో కనిపించగా సింహాతో సింహం అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు.

బాలయ్య లయన్ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా ?
Balakrishna

ఈ బ్యాగ్ ఎమ్మార్పీ ధర 25,000 రూపాయలు కాగా.. 37% డిస్కౌంట్ ఆఫర్ ఉండటంతో 15,689 రూపాయలతో ఈ బ్యాగ్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బాలయ్య లయన్ బ్యాగ్ ఖరీదు తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుంది. బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానుండగా భగవంత్ కేసరి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా మరో నాలుగు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య అటు సినీ కెరీర్ లో, ఇటు పొలిటికల్ కార్యక్రమాల్లో సక్సెస్ సాధించాలని నెటిజన్లు అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో బాలయ్య కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో మనం చూడాల్సి ఉంది. బాలయ్య బాబీ కాంబో సినిమా షూటింగ్ త్వరలో మొదలుకావాల్సి ఉండగా మారుతున్న పొలిటికల్ పరిస్థితుల వల్ల ఈ మూవీ షూటింగ్ అనుకున్న విధంగా మొదలవుతుందో లేదో చూడాల్సి ఉంది. గతేడాది ఒక్క మూవీ ను కూడా విడుదల చేయని బాలయ్య ఈ ఏడాది రెండు మూవీ లను విడుదల చేస్తుండటం గమనార్హం. బాలయ్య క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండగా.. బాలయ్య రెమ్యూనరేషన్ భారీ రేంజ్ లో పెరుగుతోంది.