‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడో తెలుసా … !

Do you know when the trailer for 'We Are Coming to Sankranthi' will be released...!
Do you know when the trailer for 'We Are Coming to Sankranthi' will be released...!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సంక్రాంతి మూవీ ల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి దగ్గరయ్యింది. ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వారి అంచనాలని అందుకునే విధంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అందరినీ ఆకట్టుకుంది.

Do you know when the trailer for 'We Are Coming to Sankranthi' will be released...!
Do you know when the trailer for ‘We Are Coming to Sankranthi’ will be released…!

ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం రోజున నిజామాబాద్‌లో సాయంత్రం 5 గంటలకి ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌కి చిత్ర యూనిట్ హాజరుకానుంది. అయితే, ఈ ట్రైలర్‌ని డిజిటల్ మాధ్యమంలో రాత్రి 8.01 గంటలకి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ చిత్ర ట్రైలర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.