టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా ..?

Do you know when tillu square OTT release..?
Do you know when tillu square OTT release..?

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్క్వేర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై కొత్త అప్ డేట్ వినిపిస్తుంది . ఈ మూవీ ఓటీటీ హక్కులని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు టాక్. ఐతే, థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో ఈ మూవీ ని స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది .

Do you know when tillu square OTT release..?
Do you know when tillu square OTT release..?

అంటే.. టిల్లు స్క్వేర్ మూవీ ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ మూవీ కి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నైజాంలో ఈ మూవీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ మూవీ కి రామ్ మిర్యాల, భీమ్స్ లు సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.