సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్త నిజమవ్వాలని రూల్ ఏమి లేదు.. అలా అని అది అబద్ధమని కూడా మనం చెప్పి కొట్టి పడేయాలేము. ఎన్నెన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతే నే నిజమయ్యాయి దానికి ప్రూఫ్స్ కూడా చాలా ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తనే నిజం చేయబోతున్నాడు స్టార్ హీరో నాగ చైతన్య గారు . హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య పెళ్లి జరగబోతోంది అంటూ ఆల్మోస్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాబోయే స్థాయికు వెళ్ళిపోయింది.
అక్కినేని ఇంటి కోడలు కాబోతుంది శోభిత ధూళిపాళ అన్న పేరు ఇప్పుడు నెట్టింట మారుమ్రోగిపోతోంది . సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆ తర్వాత వాళ్ల మధ్య వచ్చిన మిస్ అండర్ స్టాండింగ్స్ కారణంగా ఆమెకి విడాకులు ఇచ్చేసాడు. ఆ తర్వాత ఆ డిప్రెషన్ నుంచి ఎలాగోలా బయటపడ్డారు . ఇప్పుడు మూవీ ల పై కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. తండేల్ సినిమా లో నటిస్తున్నాడు.
తాజాగా యూరోప్ లో జరిగిన వైన్ ఫేస్ట్ లో శోభిత ధూళిపాళ నాగచైతన్య పక్కపక్కనే ఉంది కనిపించారు. ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి . దీంతో వీళ్ళ మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అని వీళ్ళు డేటింగ్ లో ఉన్నారు అని అందరూ ఫిక్స్ అయిపోయారు జనాలు .అక్కినేని అభిమానులు అయితే శోభిత ధూళిపాలళ్లని వదినమ్మ అని అంటూ పిలిచేస్తున్నారు . ఆమె అక్కినేని ఇంటి కోడలు కాబోతోంది అంటూ ఫిక్స్ అయిపోయారు..!!