మున్సిపల్ ఎన్నికలను నిమ్మగడ్డ నిర్వహిస్తారా..?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై హై కోర్టులో కీలక వాదనలు జరిగాయి. పంచాయతీ రాజ్ చట్టం ఆర్డినెన్స్ తెచ్చి ఎస్ఈసీని తొలగించినప్పుడు మున్సిపల్ యాక్టును అమలు చేయలేదు కదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎస్ఈసీ తొలగింపు వ్యవహారంలో మునిసిపల్ యాక్ట్ ను అమలు చేయలేదు కదా? అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుకు సంబంధించి హై కోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. మరోసారి హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ తొలిగింపు వ్యవహారంపై తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పిటిషనర్లు తరుపున సీనియర్ న్యాయవాదులు వెదుల వెంకటరమణ, ఆదినారాయణ తమ వాదనలు ధర్మాసనం ముందు వినిపించారు. ఇంకా 9మంది న్యాయవాదులు తమ వాదనలు వినిపించాల్సి ఉంది. సమయం ముగియడంతో విచారణ రేపటికి వాయిదా పడింది.

కాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం తొలిగించటం మీద హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటి వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరగ్గా సోమవారం మాత్రం నేరుగా కోర్టులోనే విచారణ జరిగింది. గతవారం విచారణలో అనుమతి లేని కేసుకు సంబందంలేని వారు వీడియో కాన్ఫరెన్స్ లోకి రావటంతో నేరుగా ఈ కేసును కోర్టులో విచారణ జరపాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

సోమవారం కేసు విచారణ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ రాజ్ చట్టం అమెండ్ చేసి ఎస్ఈసీని తొలగించిన ప్రభుత్వం మున్సిపల్ యాక్ట్ ను అమెన్డ్ చేయలేదు కదా? అని ప్రశ్నించింది. అంటే మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారా? అని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. మరి రేపు ఈ కేసు విషయంలో ఎలాంటి ట్విస్ట్ లు చేసుకోబోతున్నాయో చూడాలి.