మీకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందా ?

మీకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందా ?

చాలా మంది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల మహమ్మారి సమయంలో అనేక ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి బాధలు రాకుండా ఉండాలంటే కచ్చితంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అని డైటీషియన్ చెబుతున్నారు. అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే మన జీవన విధానం అన్నిటికీ దారి తీస్తుంది. దీనికి సంబంధించిన ఎన్నో విషయాలను డైటీషియన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

ఈ విషయాలను ఖచ్చితంగా చూసి, గుర్తు పెట్టుకుని.. ఆచరించాలి. దీంతో తప్పక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన బాడీ ఎప్పుడూ కూడా రోగ నిరోధక శక్తిని చూపిస్తుంది. ఉదాహరణకు దోమ కుట్టినప్పుడు ఎర్రగా కమిలిపోవడం దురదకలగడం వంటివి చూసినప్పుడు రోగ నిరోధక శక్తి పని చేస్తుందని తెలుస్తుంది. అదే విధంగా బాక్టీరియా లేదా క్రిములు సోకకుండా మొదట జలుబు వస్తుంది. ఇలా కొన్ని కొన్ని వాటి వలన మనం రోగ నిరోధక శక్తి బాగా పని చేస్తుందని తెలుసుకోవచ్చు.

ఒకవేళ కనుక మీ రోగ నిరోధక శక్తి పనిచేయకపోతే మీకు ఎప్పుడు కూడా జలుబు రాదు. ఒకవేళ మీకు ఏమైనా అనారోగ్య సమస్య వచ్చినా శరీరంలో ఎలాంటి మార్పు రాదు. అయితే ఏది ఏమైనా రోగ నిరోధక శక్తిని తప్పకుండా పెంపొందించుకోవాలి. రోగ నిరోధక శక్తి సరిగ్గా లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయని డైటీషియన్ అంటున్నారు. అయితే రోగ నిరోధక శక్తిపై ఇవి కూడా ప్రభావితం చేస్తాయి తప్పకుండా వీటిని ఒకసారి చూడండి. మీరు వీటిపై మార్పులు చేసుకుంటే తప్పకుండా మీ రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది.

మనం నిద్ర పోయేటప్పుడు సైటోకైన్స్ అనే ఒక ప్రోటీన్ ఇమ్యూన్ ఫంక్షన్ సరిగ్గా అవ్వడానికి విడుదల చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక సరిగ్గా నిద్ర లేకపోతే దీని ఎఫెక్ట్ రోగ నిరోధక శక్తి పై ప్రభావం చూపిస్తుంది గమనించండి.ఒత్తిడి, యాంగ్జైటీ కూడా రోగ నిరోధక శక్తి పై ప్రభావం చూపిస్తుంది. అయితే దీని వల్ల లింపోసైట్స్ తగ్గుతాయి. ఇలా యాంగ్జైటీ మరియు ఒత్తిడి కూడా రోగ నిరోధకశక్తి పై ప్రభావం చూపిస్తాయి.

గింజలు, నట్స్ వంటి వాటిలో జింక్, బీటా-కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటాయి. అలాగే ఇతర పోషక పదార్థాలు కూడా వీటి వల్ల మనకి లభిస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్‌ని క్రియేట్ చేస్తాయి.విటమిన్ డి రిసెప్టార్స్ ఇమ్యూన్ సెల్స్‌లో ఉంటాయి. అయితే ఇవి రోగ నిరోధక శక్తి సరిగా పనిచేసేలా చేస్తాయి.ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ మొత్తం బాడీలోకి వెళుతుంది. దీనితో ఇలా ఇది కూడా ప్రభావం చూపిస్తుంది.

ఇక రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చూస్తే… రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకు కూడా ఈ ఆహారం ఇస్తే రోగ నిరోధక శక్తి వాళ్ళల్లో తప్పకుండా పెరుగుతుంది.ఆహారం మీద ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కనుక మంచి పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. రోగ నిరోధక శక్తి పెంచడానికి బాదం బాగా ఉపయోగ పడుతుంది. బాదంలో విటమిన్ ఈ, మాంగనీస్ ఉంటాయి. రోగనిరోధక శక్తిని నిజంగా దృఢంగా చేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా బాదం తీసుకోండి.

అదే విధంగా పాలకూరలో కూడా మంచి పోషక పదార్థాలు ఉంటాయి. పాలకూర పప్పు, పాలక్ పన్నీర్, పాలక్ స్మూతీ మొదలైన వంటలని చేయొచ్చు. పైగా వీటి రుచి కూడా బాగుంటుంది. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, సెలీనియం, ఐరన్ ఉంటాయి. కనుక రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇది కూడా తీసుకోవచ్చు.ఇది ఇలా ఉంటే గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ గింజలు, ఫ్లేక్ సీడ్స్ వంటి వాటిలో కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఉన్నాయి. అదే విధంగా విటమిన్ ఈ, జింక్ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ గింజల్ని కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.

కమలా పండ్లు, బత్తాయి పండ్లు, జామ పండ్లలో కూడా అద్భుతమైన గుణాలు ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కాబట్టి రెగ్యులర్‌గా వీటిని కూడా తీసుకుంటే మంచిది. అంతే కాదు గుడ్లలో కూడా మంచి పోషక పదార్థాలు ఉంటాయి. విటమిన్ డి ఉండే గుడ్లను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కనుక ఈ ఆహార పదార్థాలను మీ డైట్‌లో తీసుకోండి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా మీరు అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టి ఆరోగ్యంగా ఉండచ్చు.