ఇన్ని రోజులు మనుషుల చాలెంజ్‌లు చూసి బోర్ కొట్టిందా? మీకే కాదు.. సోషల్ మీడియా చాలెంజ్‌లు కనిపెట్టేవాళ్లకు కూడా బోర్ కొట్టినట్టుంది. అందుకే.. ఇప్పుడు కుక్కల మీద పడ్డారు. అవును.. కుక్కల చాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్కలు కూడా సోషల్ మీడియా చాలెంజ్‌లో పాల్గొంటాయా? అని నోరు వెళ్లబెట్టకండి. వాటిని వెర్రి చేయడమే ఈ చాలెంజ్ ఉద్దేశం. దీనికి ఓ పేరు కూడా పెట్టారు. అదే.. ఇన్విజిబుల్చాలెంజ్.
ఈ చాలెంజ్‌లో భాగంగా.. ముదు ఏదైనా డోర్‌కు అడ్డంగా ప్లాస్టిక్ కవర్ కట్టి.. పెట్ డాగ్‌ను వెంట పడేలా చేసుకోవాలి. అది తన యజమాని వెంట పరిగెడుతుంటే అడ్డంగా కట్టి ఉన్న ప్లాస్టిక్ కవర్ మీది నుంచి దూకి వెళ్లాలి. ఇక్కడే అసలు చాలెంజ్ ప్రారంభం అవుతుంది. నిజానికి కుక్క ముందుగా ఆ ప్లాస్టిక్ కవర్‌ను చూసుకోకుండా అడ్డం వెళ్తుంది. దీంతో ప్లాస్టిక్ కవర్‌కు తాకి కింద పడిపోతుంది. దాన్ని చూసి భయపడుతుంది. ఆసమయంలో కుక్క ఎలా ఫీల్ అవుతుందో గమనించి.. దాన్ని రికార్డు చేసి ఇన్విజిబుల్చాలెంజ్ హాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయాలి. అంతే.. పెట్ డాగ్స్‌ను ప్రాంక్ చేస్తున్న ఈ చాలెంజ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.