ట్రంప్ విందుకు బ‌ళ్లారి ఎంపీ

Donald Trump invites to MP Sriramulu for Breakfast

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కుడి భుజం, బ‌ళ్లారి లోక్ స‌భ స‌భ్యుడు శ్రీరాముల‌కు అరుదైన ఆహ్వానం ల‌భించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే విందుకు హాజ‌రుకావాల్సిందిగా వైట్ హౌస్ ఆయ‌న్ను ఆహ్వానించింది. అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత 130 దేశాల నుంచి ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించి వారికి ఆ దేశ సంప్ర‌దాయం ప్ర‌కారం విందు ఇవ్వ‌డం అక్క‌డి ఆన‌వాయితీ. ట్రంప్ కూడా ఆ ఆన‌వాయితీని కొనసాగిస్తూ విందు ఏర్పాటుచేస్తున్నారు. ఈ విందులోనే పాల్గొన‌డానికి శ్రీరాముల‌ను ఆహ్వానించారు. ఇండియా నుంచి ఇద్ద‌రికే ఈ విందు ఆహ్వానం అందింది. వీరిలో ఒక‌రు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫడ్న‌విస్ కాగా మరొక‌రు శ్రీరాములు. ట్రంప్ ఆహ్వానంపై శ్రీరాములు సంతోషం వ్య‌క్తంచేశారు. అమెరికా అధ్యక్షుడు త‌న‌ను ఆహ్వానించ‌డం మ‌రిచిపోలేని అనుభూత‌న్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో విందు జ‌ర‌గ‌నుంది.