అమెరికాకు చెందని వారు కూడా పిల్లలను కని అక్కడి పౌరసత్వ హక్కును సొంతం చేసుకునే హక్కును ఎలా అంతం చేయాలనే దానిపై దృష్టి సారిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. జన్మహక్కు పౌరసత్వం అనే ఈ హక్కును ట్రంప్ హాస్యాస్పదమని పేర్కొన్నారు.
‘మీరు సరిహద్దు దాటి, బిడ్డని కంటే కంగ్రాట్యులేషన్స్. ఇప్పుడు, ఈ బేబీ యుఎస్ పౌరుడు ఎలా అయిపోతుందో అంటూ ఈ విధానాన్ని తాము చాలా తీవ్రంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇక యుఎస్ రాజ్యాంగం యొక్క 14వ సవరణ ప్రకారం, యునైటెడ్ స్టేట్స్లో జన్మించిన వారందరూ యునైటెడ్ స్టేట్స్ పౌరులుగా గుర్తిస్తారు. జన్మహక్కు పౌరసత్వాన్ని ఆపేయడం అనేది డొనాల్డ్ ట్రంప్ తన 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలలో ఒకటి.
2020 అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయానికి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇక పౌరులు కానివారు పుట్టిన వెంటనే తమ పిల్లలకు యుఎస్ పౌరసత్వాన్ని బహుమతిగా ఇచ్చే పద్ధతి కలిగి ఉండకపోవచ్చు. తదుపరి ఎన్నికలలో ఇది పెద్ద అంశం అనే చెప్పాలి.