మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగురవేసిన వివాదం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత మొదలుకుని నేతలు స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు, ఈరోజు ఏపీ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు.
దీంతో ఈ వివాదంపై తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ క్లారిటీ ఇచ్చారు. వరదల కారణంగా అంచనా కోసం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ డ్రోన్ ఉపయోగించిందని స్పష్టం చేశారు. కానీ లోకల్ పోలీసులకు సమాచారం లేకపోవడంతో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు.
ఇందులో ఎటువంటి కుట్రా లేదన్నారు. దీనిని రాజకీయం చేయవద్దని ఇక పై ఎవరైనా డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారురు.
ఇరిగేషన్ అధికారులకు, స్థానిక పోలీసులకు మద్య సమన్వయం లేని కారణంగా ఈ వివాదం నెలకొందని డీజీపీ సవాంగ్ తెలిపారు. అయితే డీజీపీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.