కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని రంగాలను హడలెత్తించేస్తుంది. దీంతో ప్రపంచ ప్రజలు వణికిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో హాస్పిటళ్లు, పోలీస్ స్టేషన్లు, న్యూస్ రూమ్‌లు తాత్కాలికంగా మూత పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ ఎవరిపై ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ ప్రాతం, ఆ ఆపీస్ మూత వేయాల్సిందే. ఒకరికి కోవిడ్ సోకితే.. వారి నుంచి మిగతా వాళ్లకు సోకే ప్రమాదం ఉండటంతో.. అందర్నీ క్వారంటైన్లో ఉంచాలని ఆయా ఆఫీసులు తీసుకున్న నిర్ణాయాలు. అయితే ఇప్పుడు అదే జాబితాలో దూరదర్శన్ న్యూస్ స్టూడియో కూడా చేరింది. ఢిల్లీలోని డీడీ న్యూస్‌లో వీడియో జర్నలిస్ట్‌గా పని చేస్తోన్న యోగేష్ కుమార్ ఈమధ్య ఉన్నట్టుండి ఇంట్లో కుప్పకూలిపోయారు. మే 21న యోగేష్ కుమార్ చివరిసారిగా ఆఫీసుకు వెళ్లారు. ఒంట్లో నలతగా ఉండటంతో సెలవు పెట్టారు.
అయితే మొదట్లో ఆయనలో ఏవిధమైన కరోనా లక్షణాలు కనిపించలేదని.. శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది మాత్రం పడ్డారని యోగేష్ అన్నయ్య తెలిపారు. ఆ తర్వాత మే 27న ఆయన కుప్పకూలగా వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యలు వెల్లడించినట్లు వివరంచారు. ముందు వడదెబ్బ వల్ల చనిపోయాడని భావించినా,, ఆ తర్వాత గుండెపోటు వల్ల చనిపోయాడని తేలింది. తర్వాత కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని రిపోర్టు రావడంతో అంతా షాక్ కి గురయ్యారు. కాగా ఈ ఘటనతో డీడీ న్యూస్ కెమెరా డివిజన్‌కు చెందిన 50 మందిని రాంమనోహర్ లోహియా హాస్పిటల్‌కు తరలించి కరోనా టెస్టులు చేయించారు. డీడీ న్యూస్ స్టూడియోను తాత్కాలికంగా మూసివేసి శానిటైజ్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. నవ్వుతూ పలకరిస్తూ.. వీడియోలు తీసే జర్నలిస్టు ఆకస్మికంగా చనిపోవడంతో డీడీ ఉద్యోగులు షాక్‌కు లోనయ్యారు. అదే సమయంలో డీడీ న్యూస్ స్టూడియోను మండీ హౌస్ నుంచి ఖేల్‌గావ్‌కు మార్చారు. ఆ విభాగంలో ఒక్కో ఉద్యోగి వారానికి రెండు రోజుల చొప్పున విధులకు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తానికి కరోనా సృష్టిస్తోన్న కలకలం అంతా ఇంతా కాదని ప్రజలు విలవిలలాడిపోతున్నారని స్పష్టమౌతుంది.