నమ్మకంగా ఉంటాడని పనిలో పెట్టుకున్న ఓ యాజమానికి కారు డ్రైవర్ టోకరా ఇచ్చాడు. బీఎండబ్ల్యూ కారుతో ఉడాయించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పరిధిలో జరిగింది. అయితే, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్న బంజారాహిల్స్ పోలీసులు గురువారం అతన్ని రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రముఖ వ్యాపారవేత్త మంజుశ్రీ పాలిమర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ 2019లో గుండప్ప అనే డ్రైవర్ను తన వద్ద పనిలో పెట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 23న మధుసూదన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. గుండప్ప బీఎండబ్ల్యూ కారుతో సహా పారిపోయాడు. ఈ విషయంపై బాధితుడు పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రాంభించారు. సెల్సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు కృష్ణానగర్ గ్రీన్ బావర్చి హోటల్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా, నిందితుడు నేరం అంగీకరించాడు.