నిన్న అర్ధరాత్రి పెనుప్రమాదం తృటిలో తప్పింది. గుండెపోటు వచ్చినా తాను నడుపుతున్న బస్సును పక్కకు తీశాడు డ్రైవర్. స్టీరింగ్ పట్టుకునే మృతి చెందాడు జోగేంద్ర సేథి. ఆ సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జాతీయ రహదారిపై నిన్న అర్ధరాత్రి పెనుప్రమాదం తప్పింది. టెక్కలి మీదుగా భువనేశ్వర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ జోగేంద్ర సేథికి గుండెపోటు రావటంతో బస్సును పక్కనే ఉన్న పొలాల్లోకి పోనిచ్చాడు. అనంతరం స్టీరింగ్ పట్టుకునే కన్నుమూశాడు.
గుండెపోటు వచ్చినా డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించటంతో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ మృతదేహాన్ని టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించి… ప్రయాణికులను వేర్వేరు వాహనాల్లో గమ్యస్థానాలకు పంపించారు.