నా మీద నాకు నమ్మకం ఉంది

నా మీద నాకు నమ్మకం ఉంది

బంజారాహిల్స్‌ ర్యాడిసన్ బ్లూ హోటల్​లోని ఫుడింగ్‌ అండ్ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ బయటపడటం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన దాడిలో పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకోగా వీరిలో సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉండటం మరింత సెన్సేషన్‌గా మారింది. ఇక ఈ లిస్ట్‌లో ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌, మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ఉన్న సంగతి తెలిసిందే.

ఇటీవలె డ్రగ్స్‌ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని రాహుల్‌ స్పష్టం చేసినా అతనితో ఆరోపణలు ఆగడం లేదు. రెగ్యులర్‌గా పబ్‌కు వెళ్లే అలవాటు ఉండటంతో రాహుల్‌ని నిందిస్తూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్నారు. తాజాగా రాహుల్‌ ఓ వీడియోను విడుదల చేశాడు.

ఇందులో.. నన్ను నమ్మడానికి. నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అయినప్పటికీ నా మీద నాకు నమ్మకం ఉంది. నిజం ఏంటో నాకు తెలుసు అంటూ ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు కొందరు నిన్ను నమ్ముతున్నాం రాహుల్‌.. వి ఆర్‌ విత్‌ యూ అంటూ సపోర్ట్‌గా నిలుస్తున్నారు.