ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా డ్రగ్స్ కలకలం సృష్టించాయి. నగరాలు, పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు పచ్చని పచ్చని కోనసీమలో అలజడి రేపింది. నెదర్లాండ్ లో డ్రగ్స్ బుక్ చేస్తే భీమవరం వంటి పట్టణాలకు నేరుగా చేరిపోతున్నాయి. అలా వచ్చిన డ్రగ్స్ ను సీజ్ చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులకు వారి విచారణలో షాక్ కి గురి చేసే అంశాలు వెలుగు చూశాయి. కాగా తాజాగా నెదర్లాండ్ నుంచి వచ్చిన ఓ చిన్న పార్సిల్ లో ఉన్న డ్రగ్స్ ను స్కానింగ్ లో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాని అడ్రస్ నెదర్లాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంకు అని ఉంది. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అనుమానం వచ్చి. పార్శిల్ లో చూడగా అందులో 400 MDMA పిల్స్ ను అధికారులు సీజ్ చేశారు.
అయితే డ్రగ్స్‌లో గంజా, హెరాయిన్, చరస్, హఫీం, కొకైన్, మ్యాజిక్ మష్రూం, ఎల్ఎస్డి, ఎండిఎం వాటి కంటే… అంతకుమించి ఎంతో ప్రమాదకరమైన దాన్ని గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగారు పార్శిల్ పై ఉన్న అడ్రస్ ఆధారంగా భీమవరానికి చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి వెంటనే చెన్నై తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఈ డ్రగ్స్ దందా ఏపీలో సంచలనంగా మారింది.