కాంగ్రెస్ లో సుధీర్గ కాలం ఉండి ఆ పార్టీకి పీసీసి అద్యక్ష్యుడిగా పంసిహేసి ప్రస్తుతం టీఆరెస్ గూటికి చేరుకొని రాజ్యసభ సభ్యుడు అయిన డీ శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ ఆరోపణల మీద ఫిర్యాదు చేసేందుకు 11 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు, మహిళా సంఘం నేతలు కలిసి హో మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని కలిశారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు హోంమంత్రి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిజామాబాద్ లోని తన సొంత నిజామాబాద్ శాంకరీ మహిళా నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులను సంజయ్ వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. . ప్రిన్సిపాల్ లేని సమయంలో గదికి రావాలంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రేపు డీజీపీ, కమిషనర్‌ను కలవాలని హోంమంత్రి నాయిని వారికి సూచించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు.