టాలీవుడ్లో వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు రాబోతున్నాయి. ఇప్పటికే పలు మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కుతున్న విషయంతెల్సిందే. వెంకటేష్ రెండు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ రెండు మల్టీస్టారర్ చిత్రాల్లో మొదటిది ‘ఎఫ్2’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుణ్ తేజ్‌తో కలిసి ‘ఎఫ్2’ చిత్రంలో వెంకీ ఆ చిత్రాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత చైతూతో కలిసి వెంకటేష్ ‘వెంకీమామ’అనే మల్టీస్టారర్‌ను చేయబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో వెంకీ మామ తెరకెక్కబోతుంది. భారీ అంచనాలున్న ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సమయంలోనే మరో రెండు మల్టీస్టారర్ చిత్రాలకు వెంకీ గ్రీన్ సిగ్నల్ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే ఒక చిత్రంను సూర్యతో కలిసి చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. వెంకీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న ఆ చిత్రంలో సూర్య కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా మరో మల్టీస్టారర్ చిత్రంకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈమద్య తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ‘మహానటి’ చిత్రంలో జెమిని గణేషన్‌గా నటించి అలరించిన దుల్కర్ తాజాగా వెంకీతో కలిసి నటించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. భారీ యుద్దం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే ఏడాది రెండు, ఆ తర్వాత ఏడాది రెండు మల్టీస్టారర్ చిత్రాలతో వెంకీ అలరించబోతున్నాడు.