నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టు 

duplicate-preparation-of-alcohol-gang-up

హైదరాబాద్ శివార్లలో నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ అధికారులు. గత కొంత కాలంగా ఖరీదైన మద్యం తయారు చేసి వైన్ షాప్‌లకు విక్రయిస్తోంది ఈ నకిలీ లిక్కర్‌ ముఠా.

అంత్యంత్య ఖరీదైన బ్రాండ్‌లకు చెందిన లిక్కర్‌ను ఈ ముఠా తయారు చేయడం విశేషం.  ఈ ముఠా గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించింది.

హైదరాబాద్‌తో పాటు వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. యాద్రాది జిల్లా పొచంపల్లిలోని ఒక పాడుబడిన గొడౌన్లో ఈ లిక్కర్ ను తయారు చేస్తున్నారు.

బాటిళ్లు, లేబుళ్ల దగ్గర నుంచి మూతల వరకూ అసలేదో నకిలీది ఏదో గుర్తుపట్టలేనంత పక్కాగా తయారు చేస్తోంది ఈ ముఠా. నకిలీ మద్యాన్ని వైన్ షాపులకు టొకుగా విక్రయిస్తున్న ముఠాలోని ఐదుగురు సభ్యుల్ని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్‌ చేశారు.

నిందితుల్ని మద్ది అనిల్ రెడ్డి, మద్ది నరేందర్ రెడ్డి, మద్ది  విక్రమ్ రెడ్డి, మద్ది లట్టు, బండారు నరేందర్‌గా  గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు లాయక్ అలీ ముద్దిరాజ్ పరారీలో ఉన్నాడు.

తయారీ చేసి మద్యం ను హైదరాబాద్ తో పాటుగా వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు సరఫరా చేస్తుంది. యాద్రాది జిల్లా పొచంపల్లిలోని ఒక పాత బడిన గౌడౌన్ లో ఈ లిక్కర్ ను తయారీ చేస్తున్నారు.