పొట్టి క్రికెట్లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో 500 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బుధవారం జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్-2021)లో ఫైనల్ మ్యాచ్ ఆడడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తంగా 500 టీ20లు ఆడిన బ్రావో.. 6,566 పరుగులు సాధించడంతో పాటు 540 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ జాబితాలో విండీస్‌కే చెందిన మరో ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పొలార్డ్ 561 మ్యాచ్‌ల్లో 11,159 పరుగులు చేయడంతో పాటు 298 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదిలా ఉంటే, సీపీఎల్‌లో బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బ్రావో సారథ్యంలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సెయింట్ లూసియా కింగ్స్‌పై మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. రకీమ్ కార్న్‌వాల్(32 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్(40 బంతుల్లో 43; ఫోర్లు, 2 సిక్సర్లు), కీమో పాల్(21 బంతుల్లో 39; 5 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఛేదనలో సెయింట్ కిట్స్ ఆటగాడు డొమినిక్ బ్రేక్స్(24 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.