కరీబియన్ దేశం హైతీలో శనివారం సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 1,297కు చేరింది. దాదాపు 5,700 మంది గాయపడగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. క్షతగాత్రులతో అక్కడి ఆస్పత్రులన్నీ నిండిపోయాయి.
మరోవైపు తీవ్ర తుపాను ప్రమాదం ఉందని ఆ దేశ వాతావరణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా, అధ్యక్షుడి హత్య, సాయుధ ముఠాల ఘర్షణలు వంటి సమస్యలతో అల్లాడుతున్న హైతీకి భూకంపం, భారీ వర్షాలు పరిస్థితులను మరింత జఠిలం చేశాయి.