బంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో చెన్నైలో స్వల్పంగా భూమి కంపించింది. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు.
మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ పై భూకంపం ఎటువంటి ప్రభావం చూపలేదని రాష్ట్ర విపత్తులశాఖ తెలిపింది.