ఇండోనేషియా, జావాలో భారీ భూకంపం

ఇండోనేషియా, జావాలో భారీ భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఒక గంట వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. తొలిసారిగా భూమి కంపించడంతో దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఇది జావా ద్వీపంలో సంభవించింది. గంట వ్యవధిలో మరో భూకంపం అదే తీవ్రతతో ఇండోనేషియాలో సంభవించింది. ఇది బాలి ద్వీపాన్ని తాకిందని యూరోపియన్ మెడిటెరేనియన్ భూకంప కేంద్రం తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ఇండోనేషియాలో జనాభా 260 మిలియన్ ఉంది. ఇక ఆ దేశంలో భూకంపాలు సర్వసాధారణం. అంతేకాదు భారీ అగ్నిపర్వతాలు కూడా తరుచూ విస్ఫోటనం చెందడం దాన్నుంచి పొంగిపొర్లే లావా, పొగ సమీపప్రాంతాలను చుట్టుముట్టుతుండటం సాధారణంగా కనిపిస్తాయి. ఇక ఈ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనంకు కారణం ఆ ప్రాంతం పసిఫిక్ తీరంలో ఉండటమే. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలుస్తారు.