విస్తరిస్తున్న ఎడ్‌టెక్‌ సేవలు

విస్తరిస్తున్న ఎడ్‌టెక్‌ సేవలు

ఎడ్‌టెక్‌ సేవలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఎడ్‌టెక్‌లో తనదైన ముద్ర వేసిన ప్రిప్‌ఇన్‌స్టా తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో కూడా సేవలు అందివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రిప్‌ఇన్‌స్టా ప్రైమ్‌ పేరుతో సరికొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రొఫెనల్స్‌కు అనువుగా ఉండేలా సింగిల్‌ సబ్‌స్క్రిప్షన్‌తో 150 రకాల కోర్సులు ప్రిప్‌ఇన్‌స్టా అందివ్వనుంది.

ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీలతో పాటు సీ, సీ ప్లస్‌ వంటికోడింగ్‌ కోర్సులు, పైథాన్‌, డీఎస్‌ఏ వంటి స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ కోర్సులు ఇక్కడ లభిస్తున్నాయి. సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ విషయానికి వస్తే మూడు నెలలకు రూ.2499 నుంచి రూ.6499 వరకు ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రిప్‌ ఇన్‌స్టాకు 15 లక్షల మంది చందాదారులు ఉన్నారు. ఇక్కడ 150కి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.