ఈ మాయ పేరేమిటో రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

e maya peremito movie

నటీ నటులు : రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్,రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, రాళ్ల‌ప‌ల్లి, ఈశ్వ‌రీరావు,
దర్శకత్వం : రాము కొప్పుల
నిర్మాత : దివ్యా విజ‌య్‌
సంగీతం : మ‌ణిశ‌ర్మ‌
సినిమాటోగ్రఫీ : శామ్ కె.నాయుడు
ఎడిటర్ : న‌వీన్ నూలి

e maya peremito movie

కొత్త దర్శకుడు రాము దర్శకత్వంలో, ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ కుమారుడు ‘రాహుల్ విజ‌య్’ హీరోగా రూపొందిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. రాహుల్ సరసన కావ్య తపార్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్ మీద నిర్మించారు. ఈ రోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..

స్టోరీ లైన్ :

Ee Maya Peremito Telugu Movie

చందు (రాహుల్ విజయ్) కాలనీలో ఫ్రెండ్స్ తో పనీపాటా లేకుండా తిరుగుతుంటాడు. ఆవారా అనే పేరే గానీ కాలనీలో అందరికీ తలలో ఉంటూ సహాయపడుతూ ఉంటాడు. అనుకోకుండా చందును చూసిన సీతల్ (కావ్య తపార్) అతన్ని ప్రేమించాలని ఫిక్సయ్యి అతని గురించి కాలనీలో కొందరిని కనుక్కుని ఫైనల్ గా అతన్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలో కొన్నిరోజులు కలిసి తిరుగుతారు. ఈ విషయం తెలిసిన సీతల్ తండ్రి (మురళి శర్మ) ఏ తండ్రి అయినా తన కూతురుకి ఎలాంటి భర్త రావాలని కోరుకుంటాడో ఆ విషయం గురించి చందుకి అర్ధమయ్యేలా తెలివిగా ఎమోషనల్ చెప్తాడు. అలా నువ్వు మారితే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. దాంతో.. చందు, సీతల్ కోసం తన జీవిత శైలిని మార్చుకుంటాడు. అలా తనని తాను మార్చుకుంటున్న క్రమంలో సీతల్ కి చందు నచ్చడు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఈలోగా సీతల్ కి వేరే పెళ్లి ఫిక్స్ అవుతుంది. అసలు సీతల్ కి చందు నచ్చకపోవటానికి రీజన్ ఏమిటి ? చివరకి సీతల్ చందుని అర్ధం చేసుకుంటుందా ? తిరిగి ప్రేమిస్తుందా ? వారి పెళ్లి జరుగుతుందా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ :

Ee Maya Peremito trailer

హీరో రాహుల్ విజ‌య్ కి మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగున్నాడు. ఓ కాలనీలో సరదాగా తిరిగే ఓ కుర్రాడి పాత్రలో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హీరోయిన్ తో సాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో గాని, తన మదర్ కి తనకి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లలో గాని రాహుల్ విజయ్ చాలా చక్కగా నటించాడు. ‌రాహుల్ సరసన హీరోయిన్ గా నటించిన కావ్య తపార్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కావ్య తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. హీరోయిన్ ఫాదర్ గా నటించిన మురళి శర్మ తన కెరీర్ లోనే మరో గుర్తు పెట్టుకున్నే పాత్ర చేశారు.

Rahul Vijay to debut with Ee Maaya Peremito

అలాగే కొడుకుని అమితంగా ప్రేమించే ఫాదర్ రోల్ లో కనిపించిన రాజేంద్ర ప్రసాద్ కూడా తన నటనతో నవ్విస్తూనే, ఇటు ఎమోషన్ సీన్స్ ని కూడా బాగా పండించారు. ఇక మిగతా నటీనటులు అయిన సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. ఇది ఒక రెగ్యూలర్ లవ్ స్టోరీ అందుకే చాలా చోట్ల సినిమాటెక్ గా సాగుతూ సినిమా మీద ఆసక్తి లేకుండా సాగుతుంది. దర్శకుడు స్క్రిప్ట్ ను పేపర్ మీద రాసుకున్నంత బాగా స్క్రీన్ మీదకు ఎక్కించలేకపోయారు. సంగీత దర్శకుడు మణిశర్మ సమకూర్చున పాటలు ఆయన స్థాయిలో లేకపోయినా బాగున్నాయి. ఇక శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ .

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : ఈ మాయ పేరేమిటో – ఒక రొటీన్ లవ్ స్టోరీ
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2 /5