ఈ నగరానికి ఏమైంది…తెలుగు బులెట్ రివ్యూ

Ee Nagaraniki Emaindi Movie Review
నటీనటులు : వర్గంవిశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం,
                   వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి
మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ సాగర్ 
ప్రొడక్షన్ హౌస్ : సురేష్ ప్రొడక్షన్స్
డైరెక్టర్ : తరుణ్ భాస్కర్ దాస్యం 
ప్రొడ్యూసర్ : సురేష్ బాబు 

“ పెళ్లి చూపులు సినిమాతో యువతరాన్ని ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ తాజాగా “ ఈ నగరానికి ఏమైంది “ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి సినిమాలో హీరో లో ఓ టాలెంట్ ఉన్నప్పటికీ బాధ్యతారహితంగా ఉంటాడు. బాధ్యతగా ఉండికూడా మహిళ అన్న వివక్ష ఎదుర్కొనే హీరోయిన్ అతన్ని గాడిలో పెట్టడంతో పాటు అతనితో జీవితాన్ని పంచుకుంటుంది. ఈ కధలో వున్న ఒక్క హీరో” ఈ నగరానికి ఏమైందికి “ వచ్చేసరికి నలుగురు అయ్యారు. అందరిలో ఏదో టాలెంట్ ఉంటుంది. కానీ ఆ వయసులో వుండే బాధ్యతారాహిత్యంతో గాలివాటంగా ప్రవర్తిస్తుంటారు. షార్ట్ ఫిలిం ఆపై సినిమా రంగంలోకి వెళ్ళాలి అనుకునే ఆ నలుగురు చిన్ననాటి స్నేహితుల జీవితంలో వచ్చే సంఘటనలు , వాటి పర్యవసానాలు ఏంటి అనేదే ఈ సినిమా.

 ఈ నగారానికి ఏమైంది ? : సినిమా విశ్లేషణ 

పెళ్లిచూపులు కధలో హీరో., హీరోయిన్ యువతరానికి ప్రతిజినిధులు. అయితే వారి నేపధ్యం మధ్యతరగతికి సంబంధించింది కావడంతో ఆ స్టోరీ బాగా కనెక్ట్ అయ్యింది. అయితే “ఈ నగరానికి ఏమైంది “ దగ్గరకు వచ్చేసరికి పేరుకి నలుగురు కుర్రోళ్ళు మధ్యతరగతి వాళ్లే కానీ వారి జీవనశైలి ఎక్కడా ఆ రకంగా కనిపించదు. నేపధ్యం ఓ రకంగా , కధలోని పాత్రలు ఓ రకంగా ఉండటంతో ప్రేక్షకుడు వాటితో పూర్తిగా కనెక్ట్ కాలేకపోయాడు. ఇక సినిమా అంతా కనిపించిన వాతావరణం భిన్నంగా కనిపిస్తున్నప్పుడు ప్రేక్షకుడు అందులో కలిసిపోయే ఛాన్స్ తక్కువ. ఇక కధలో స్నేహం ,,ప్రేమ , జీవన తత్వం అన్నీ కనిపిస్తాయి. అయితే దేనికీ ఎవరూ పెద్దగా విలువ ఇవ్వరు.

చెప్పడం కన్నా చూపడం ద్వారా ఈ తరహా యువతరం సినిమా చేద్దాం అని తరుణ్ భాస్కర్ అనుకుని ఉండొచ్చు. కానీ నిజానికి ఇక్కడ అతనిలోని రచయితే డామినేట్ చేసాడు. కామెడీ పర్లేదు అనిపించినా కొంత సమయం గడిచేసరికి అదే రిపీట్ అవుతున్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. తరుణ్ భాస్కర్ కంటెంట్ విషయంలో ఎవరికీ సందేహం లేదు. అయితే ఆ సినిమాలోని హీరో కి లాగే ఓ భయం ఉన్నట్టుండి. హీరోకి తొలిప్రయత్నం మీద భయం ఉంటే , దర్శకుడుకి తొలి విజయం తర్వాత ఆ భయం వచ్చినట్టు వుంది. దాంతో పాటు తొలి సినిమా తరువాత ఏ సినిమా చేయాలి అన్న మీమాంసలో ఎక్కువ టైం తీసుకున్న తరుణ్ భాస్కర్ అందులో నుంచి పూర్తిగా బయటకు రాలేదు అనిపిస్తోంది.

స్నేహితుల జీవితంలో కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా తీయాలి అనుకుంటే స్క్రీన్ ప్లే ఇంకా పకడ్బందీగా ఉండాలి. ఆ తరహాలో డేంజర్, అనుకోకుండా ఒక రోజు లాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఇక్కడ సంఘటనలతో పాటు ప్రేమ ,స్నేహం , జీవన తత్వం కలపాలి అనుకున్నప్పుడు సన్నివేశాల్లో గాఢత, మాటల్లో లోతు అవసరం. కానీ వినోదాన్ని నమ్ముకుని ఇలాంటి సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఆ భావోద్వేగాలు పండించడం కష్టం. తరుణ్ భాస్కర్ కూడా అదే సమస్య ఎదుర్కొన్నాడు. చివరకు ప్రేక్షకుడుకి కూడా కన్ఫ్యూషన్. ఈ నగరానికి ఏమైంది విషయంలో అదే జరిగింది. అయితే తరుణ్ భాస్కర్ టాలెంట్ తో థియేటర్ లో కూర్చున్నప్పుడు ఈ లోపం పెద్దగా కనిపించదు. టైం పాస్ అయిపోతుంది. కానీ సినిమా అయిపోయాక ఏ భావోద్వేగం పెద్దగా వెంట రాదు. ఈ సినిమాకి అదే మైనస్.

 

ఈ నగరంలో నటీనటులు ఎవరెలా చేశారంటే : 

ఇక నటీనటులు అంతా బాగా చేశారు. అయితే వినోదపు పాళ్ళు ఎక్కువ వున్న అభినవ్ కి కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. ఇక వివేక్ సాగర్ సంగీతం , నికేత్ బొమ్మి ఫోటోగ్రఫీ బాగున్నాయి. మొత్తానికి తరుణ్ భాస్కర్ కూడా రెండో సినిమాలో కాస్త ఒత్తిడికి లోను అయ్యాడనే చెప్పాలి.

తెలుగు బులెట్ పంచ్ లైన్ … ఈ నగరానికి ఏమైందో “ సిటీ కి మాత్రమే పడుతుంది.
తెలుగు బులెట్ రేటింగ్ …  2.75 / 5