బీజేపీ భవిష్యత్ మీద ఈనాడుకు మొహమాటం లేదు.

Eenadu Paper writes special article on Modi Career

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రధాని పీఠం మీద నరేంద్ర మోడీ కూర్చున్న తర్వాత తెలుగు పత్రికల్లో అగ్ర స్థానంలో నిలిచిన ఈనాడు బీజేపీ కి అనుకూలంగా వుంటూ వస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు ఇదే పత్రిక తెలుగుదేశానికి అనుకూలం అన్నవాళ్ళు సైతం ఈ మార్పుని పసిగట్టారు. బీజేపీ, టీడీపీ మధ్య వైరం నెలకొన్న తరుణంలో కూడా కమలనాథులకు వ్యతిరేకంగా ఈనాడు గట్టి వైఖరి తీసుకోకపోవడం అందరి దృష్టిలో పడింది. అయితే అది ఎక్కువ కాలం కొనసాగబోదని నేడు ఈనాడు చూసిన వాళ్లకు తేలిగ్గానే అర్ధం అవుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీ కి వ్యతిరేక పవానాలు వీస్తున్న విషయాన్ని విశ్లేషణాత్మకంగా ఈనాడు కధనం ఇచ్చింది. గత ఎన్నికల్లో బీజేపీ కి పట్టం కట్టడంలో కీలక పాత్ర పోషించిన 5 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎదురు గాలులు వీస్తున్న విషయాన్ని ఈనాడు విశ్లేషించింది.

యూపీ, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లో మొత్తం 200 స్థానాలకు గాను బీజేపీ 171 చోట్ల గెలిచింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అందులో సగం కూడా వచ్చేలా లేవు. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బ తింటే ఢిల్లీ గద్దె మీద ఆ పార్టీ ఆశలు వదులుకోవాల్సిందే. ఇదే విషయం మీద ఈనాడు కుండ బద్దలు కొడుతూ కధనం అందించింది. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ శక్తులు మళ్లీ బలం పుంజుకుంటున్న విషయాన్ని కళ్ళకు కట్టింది. ఈ కధనం చూసాక బీజేపీ విషయంలో ఇక ఈనాడు మొహమాటం వదిలేసిందని ఒప్పుకోవాల్సిందే.