సాధారణంగా ఆహారాన్ని తీసుకున్న తరువాత గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ లెవెల్స్ మారతాయి. అయితే ఊబకాయం సమస్యతో బాధ పడుతున్నవారిలో చాలా మార్పులు కనబడతాయి అని డయాబెటిస్ కేర్ జర్నల్‌లో చెప్పడం జరిగింది.ఎప్పుడైతే కూరగాయలను మరియు ప్రోటీన్‌ను ముందుగా తీసుకుని ఆ తరువాత కార్బోహైడ్రేట్స్‌ను తీసుకుంటామో, గ్లూకోజ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి.
ఉదాహరణకు ఆహారం తీసుకున్న తరువాత 30, 60 మరియు 120 నిమిషాలకు గ్లూకోజ్ లెవెల్స్‌ను చెక్ చేసుకుంటే 29%, 37% మరియు 17% ఇన్సులిన్ లెవల్స్ ఉంటాయని పరిశోధనలో తేలింది. కాబట్టి ప్రోటీన్ మరియు కూరగాయలు తీసుకుంటే ఇన్సులిన్ శాతం తక్కువగా ఉంటుందని గమనించాలి. అందుకనే కొంత మంది డాక్టర్లు ఈ పరిశోధనను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అని చెప్పకుండా ఏ రకమైన ఆహారాన్ని ముందుగా తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు.
నిజానికి డాక్టర్లు డయాబెటిస్ పేషెంట్లకు కార్బోహైడ్రేట్స్‌ను తినొద్దు అని చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రోటీన్‌తో పాటు కార్బోహైడ్రేట్స్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, అంతేకాక ఇవి శరీరానికి ఎంతో అవసరం. కానీ కార్బోహైడ్రేట్స్ వల్ల శరీరంలో ఇన్సులిన్ శాతం పెరిగిపోతుందని, ముందు కూరగాయలు మరియు ప్రోటీన్‌ను తీసుకోమని ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్‌ను తీసుకోమని సూచిస్తున్నారు.ఈ విధంగా బ్లడ్ షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకొని డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు.
అందుకే డైటీషియన్లు మరియు న్యూట్రిషనిస్టులు బ్యాలెన్స్డ్గా తినడంతో పాటు స్మార్ట్‌గా తినండి అని సూచిస్తూ ఉంటారు. కనుక ప్రోటీన్ తరువాత కార్బోహైడ్రేట్స్‌ను తీసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు కార్బోహైడ్రేట్స్‌ను తినడం మానాల్సిన పని లేదు పైగా ఎటువంటి బ్రేక్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ప్రోటీన్లు తిన్న తర్వాత కార్బోహైడ్రేట్స్‌ను తినడమే. సాధారణంగా భారత దేశంలో తీసుకున్నా ఆహారంలో అయితే అన్నం లేదా రోటి, పప్పు మరియు ఇతర కూరగాయలు, మాంసాహారంకు సంబంధించిన ఆహార పదార్థాలు ఉంటాయి.
మన దేశంలో ఉండే వారు 2503 కిలో క్యాలరీస్‌ను ఒక రోజుకి తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆహారాన్ని తీసుకునేటప్పుడు డయాబెటిస్ రోగులు తప్పకుండా ఈ ప్రక్రియను పాటించండి. ముందుగా పప్పు, కూరగాయలు మరియు ఇతర మాంసాహార పదార్థాలను తినండి. ఆ తరువాత రైస్ మరియు రోటీలకు తీసుకోండి. అయితే ఒక పరిశీలనలో పరిశోధనలో చెప్పిన విషయం ఏమిటంటే సాధారణంగా రోజువారి ఆహారంలో ధాన్యాలులో ఉండే క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. పండ్లు, కూరగాయలు, మాంసాహారం, గుడ్లు మరియు ఇతర పదార్థాలతో పోలిస్తే ఇవి చాలా ఎక్కువ అని చెప్పాలి.
కాబట్టి ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవడంతో పాటుగా కూరగాయలను కూడా మరికొన్ని చేర్చుకోవాలి. అయితే ఈ ప్రక్రియను ఒక న్యూట్రీషియన్ చెప్పగా కొంతమందికి కొన్ని సందేహాలు కూడా వచ్చాయి, ఏంటంటే కూరగాయల సలాడ్‌ను ముందుగా తీసుకోవాలా లేక పప్పు, అన్నం తిన్న తర్వాత తీసుకోవాలా అని. అయితే ఈ ప్రక్రియ అంతా సలాడ్, సూప్ మరియు మాంసాహారానికి సంబంధించి ఎక్కువగా వర్తిస్తుంది, అంటే ముందుగా కూరగాయలతో లేదా పండ్లతో తయారు చేసిన సలాడ్స్‌ను తీసుకుని ఆ తర్వాత సూప్స్ మరియు చివరగా చికెన్, ఫిష్ వంటి తీసుకోవాలి.
అయితే మనం తీసుకొనే డైట్లో కార్బోహైడ్రేట్లు చివరగా తీసుకోవడం కొంచెం కష్టమే. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని, ఆహారాన్ని తీసుకునేటప్పుడు బాగా నమిలి నెమ్మదిగా తినాలి.టైప్-2 డయాబెటిస్ పేషెంట్స్ సహజంగా గ్లూకోజ్ లెవల్స్‌ను చెక్ చేసుకునేటప్పుడు ఫింగర్ ప్రిక్ టెస్ట్ ను చేసుకుంటారు. ఈ ప్రక్రియ చాలా సులభంగా మరియు స్వయంగానే షుగర్ లెవల్స్‌ను తెలుసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్ చేసుకున్న తరువాత షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయని గమనించాలి.
మన దేశంలో ప్రస్తుతం 74.2 మిలియన్స్ డయాబెటిస్ రోగులు ఉండగా, వీరంతా 20 నుండి 79 ఏళ్ల మధ్య వయస్సు గల వారు మరియు 2045 సంవత్సరంకు డయాబెటిస్ రోగుల సంఖ్య 124.8 మిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేసుకుని, జీవనశైలిను మార్చుకుంటే డయాబెటిస్ కు కూడా చెక్ పెట్టవచ్చునని గుర్తుంచుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైతే డాక్టర్ ను సంప్రదించడం తప్పని సరి, మీ మెడికేషన్ కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తప్పకుండా తీసుకోవాలి.