ప్రత్యేకించి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ బ్రెయిన్ ఎక్సర్‌సైజ్ అనేది ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. అలాగని, చిన్న వయసు వాళ్ళు చేయక్కరలేదనో, చేయకూడదనో కాదండోయ్. అన్ని వయసువారూ ఈ మెదడు వ్యాయామాల నుంచి లబ్ధి పొందుతారు. పైగా ఇవన్నీ చిన్న చిన్నవి సింపుల్‌గా ఉండేవే. అవేమిటో చూసేద్దాం రండి.
మీరు వెయ్యి పీసులతో ఈఫిల్ టవర్ కడుతున్నారా, వంద పీసులతో మిక్కీ మౌస్ చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, జిగ్సా పజిల్ చేయడమే ఇంపార్టెంట్. జిగ్సా పజిల్ చేయడానికి మెదడులో అనేక భాగాలని వాడతామట, కాబట్టి మెదడుకి మంచి ఎక్సర్‌సైజ్ దొరికినట్లేనని పరిశోధకులు చెబుతున్నారు.
కార్డ్స్ అనగానే మనకి పేక, ఆ ఆటతో కలిసిపోయి ఉన్న అనేక రకాలైన ప్రతికూల ఆలోచనలు వచ్చేస్తాయి. ఇక్కడ కార్డ్స్ ఆడమంటే పందెం వేసి, డబ్బులు పెట్టి ఆడమని కాదండీ.. కేవలం సరదాగా ఆడుకోమని. సాలిటెయిర్ లాంటి కొన్ని ఆటలు ఒక్కళ్ళే ఆడుకుంటారు కూడా. ఈ ఆటలు ఆడడం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి పెరుగుతాయని స్టడీస్ చెబుతున్నాయి. సాలిటెయిర్, బ్రిడ్గ్, పోకర్, హార్ట్స్, క్రేజీ ఎయిట్స్ వంటి ఆటలు ఈ విధమైన హెల్ప్ చేస్తాయి.
మంచి మంచి పదాలు వాడితో వినేవారు మనకి చక్కని భాషా పరిజ్ఞానం ఉందనుకుంటారు. దానితో పాటు మన బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది. మీరు ఏదైనా చదువుతున్నప్పుడు ఒక నోట్‌బుక్ పక్కనే ఉంచుకోండి. మీకు తెలియని పదం రాగానే ఆ బుక్‌లో నోట్ చేసుకోండి. ఆ సందర్భాన్ని బట్టి ఆ పదం అర్ధం ఏమయ్యుంటుందని మీరనుకుంటున్నారో పక్కనే రాసుకోండి. తరువాత డిక్షనరీ తీసి ఆ పదానికి అర్ధం చూసి మీ బుక్‌లో ఆ అర్ధం కూడా రాసుకోండి. మరుసటి రోజు ఆ పదాన్ని కనీసం ఐదుసార్లు వాడడానికి ప్రయత్నించండి. అలాగే, మీకు తెలిసిన భాషలో కొత్త పదాలే కాక, ఒక కొత్త భాష నేర్చుకోవడం కూడా మంచిదే.
మీ బ్రెయిన్ స్పీడ్‌గా ఏ విషయాన్నయినా అర్ధం చేసుకోవాలన్నా, మెమరీ పవర్ బాగా పెరగాలన్నా డాన్స్ ఎంతో హెల్ప్ చేస్తుందని అంటున్నారు నిపుణులు. ఇందుకోసం, సల్సా, ట్యాప్, హిప్-హాప్, ఇంకేదైనా కాంటెంపరరీ డాన్స్ క్లాస్‌లో జాయిన్ అవ్వండి. జుంబా, జాజ్ ఎక్సర్‌సైజ్ క్లాస్‌లో జాయిన్ అవ్వవచ్చు. ఏదైనా వీడియోలో సరదాగా ఉండే డాన్స్ మూవ్స్ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఒక పార్ట్నర్ తో కలిసి బాల్‌రూమ్ డాన్స్ ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కలిసి డాన్స్ చేయండి.
అన్ని సెన్సెస్‌ని ఒకేసారి వాడడమనేది కూడా చాలా హెల్ప్ చేస్తుందట. అంటే ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు ఆ పదార్ధాన్ని కళ్ళారా చూడడం, వాసనని ఆస్వాదించడం, దాన్ని టచ్ చేయడం, దాన్ని రుచి చూడడం, ఆ పదార్ధం ప్లేట్‌లో పెడుతున్నప్పుడు వచ్చే చప్పుడు వినడం.. ఇలాంటివి బాగా హెల్ప్ చేస్తాయట. ఇలాంటి యాక్టివిటీస్ కి మెత్తని రసగుల్లా, గులాబ్‌జాం కంటే కరకరలాడే జంతికలో, చేగోడీలో అయితే ఫలితం బాగుంటుందనుకుంటా.
కొత్త స్కిల్ నేర్చుకోవడం అనేది బ్రెయిన్‌లో కనెక్షన్స్‌ని స్ట్రాంగ్‌గా చేస్తుంది. మనందరికీ ఏవో కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉంటుంది. కొత్త సాఫ్ట్‌వేర్ నేర్చుకోవడం, కార్ రిపెయిర్, వీణ నేర్చుకోవడం, కొత్త వంటలు నేర్చుకోవడం, ఇకబెనా లాంటివి నేర్చుకోవడం.. మీ ఇష్టాన్ని బట్టి కొత్తవి నేర్చుకుంటూ ఉంటే ఆ రిజల్ట్ వేరబ్బా. అయితే, ఇవి మీరు సరదాగానే నేర్చుకోవాలి తప్ప మళ్ళీ సర్టిఫికేట్ కోర్సులూ, వాటికి పరీక్షలూ అంటే స్ట్రెస్ పెరిగిపోతుంది. అలాగే, మీరు నేర్చుకున్న వాటిని మరొకరికి నేర్పడం కూడా మంచి పనే.