అల్పాహారం సమయంలో గుడ్లు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది. ఇందులో ఆల్బుమిన్, ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ లోపాన్ని కూడా ఇది తొలగిస్తుంది. గుడ్లలో ఆరు అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. జుట్టుకి, గోళ్ళకి ఇది చాలా మేలు చేస్తుంది. అదే విధంగా విటమిన్-డి కూడా గుడ్లలో ఎక్కువగా ఉంటుంది.
ఎముకల్ని దృఢంగా చేస్తుంది. అలానే క్రమం తప్పకుండా గుడ్లను తీసుకోవడం వల్ల కొన్ని నెలల్లోనే మీ శరీరం ఎంతో త్వరగా పెరుగుతుంది. రోజు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే మీ మనసు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. గుడ్లు తీసుకోవడం వల్ల ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా లాభాలు పొందొచ్చు. అయితే ఇన్ని లాభాలు ఉన్న గుడ్లను తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అని స్టడీ చెబుతోంది. ఒకటి లేదా అంత కన్నా ఎక్కువ గుడ్లను రోజూ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.
దీంతో మీకు గుడ్ల కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. పైగా డయాబెటిస్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్లని తీసుకోవచ్చా, దాని వలన కలిగే నష్టాలు ఏమిటి అనేది కూడా తెలుస్తుంది/ చైనా హెల్త్ అండ్ హాస్పిటల్ సర్వే చేసిన దాని ప్రకారం చూసినట్లయితే.. ఎక్కువ గుడ్లు తీసుకునే వారిలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గినట్లు తెలుస్తోంది. అలానే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా చేసిన రీసర్చ్ ప్రకారం పురుషుల్లో కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
గుడ్ల సొన కారణంగా ఆక్సిడేషన్ మరియు ఇన్ఫ్లమేషన్ జరిగినట్లు తేలింది. అయితే చాలా మంది అల్పాహారం సమయంలో తప్పకుండా గుడ్లను తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది చక్కటి ప్రోటీన్స్ మనకు అందిస్తుంది అని. అలానే అర గ్రాము కార్బోహైడ్రేట్ కూడా మనం దీని ద్వారా పొంద వచ్చని డైటీషియన్ స్నేహ చెప్పారు. గుడ్లు నిజంగా మంచి నాణ్యమైన ప్రోటీన్లని మనకి అందిస్తాయి. అయితే గుడ్లకి డయాబెటిస్ కి ఏమైనా సంబంధం ఉందా..?, గుడ్లని తీసుకోవడం వల్ల డయాబెటిస్ వస్తుందా లేదా డయాబెటిస్ వాళ్లకి గుడ్డు తీసుకోవడం వల్ల ముప్పు ఉందా అనేది చూద్దాం.
అయితే గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతర పోషక పదార్ధాలు కూడా ఉంటాయని మనకు తెలుసు. అలాగే కొలెస్ట్రాల్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది అయితే గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ ను తీసుకోవడం వల్ల మన ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగి పోదు. ఒకవేళ ఎక్కువ గుడ్లని కనుక తీసుకున్నట్లయితే కాస్త ఇబ్బందిగా ఉంటుంది పైగా రోజు మనం ఆయిల్, బటర్ వంటివి ఉపయోగించి గుడ్లని తీసుకుంటూ ఉంటాం. దీని వల్ల బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది.
అలాగే కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ అవుతుంది కనుక డయాబెటిస్ రిస్కు కూడా పెరుగుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు. ఒక పెద్ద గుడ్డు లో 200 మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్ ఉంటుంది అయితే ఇలా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వారికి మంచిది కాదు. అయితే గుడ్లను తీసుకునేటప్పుడు వాటిని ఉడకబెట్టి కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి, కొత్తిమీర వేసుకుని తీసుకోండి లేదు అంటే రెండు గుడ్లను ఉపయోగించి కూరగాయలను వేసుకుని ఆమ్లెట్ వేసుకోండి. అలానే ఎక్కువ గుడ్లను తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి సరిగ్గా ఎంత వరకు తీసుకుంటే మంచిదో అంతే డయాబెటిస్ వారు తీసుకోండి. అతిగా గుడ్లని తింటే డయాబెటిస్ వారికి మంచిది కాదు.