5 రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. మధ్య ప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తిస్ గడ్, తెలంగాణ, మిజోరాం లలో ఎన్నికలకు షెడ్యూల్ అయ్యింది. 2019 లో సార్వత్రిక ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమి ఫైనల్ అని వేరే చెప్పక్కర్లేదు.
ఈ వాతావరణాన్ని ఇంకాస్త రక్తి కట్టిస్తూ ఇప్పటికే పలు సర్వే సంస్థలు వివిధ రకాలైన ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఆ రిజల్ట్ సానుకూలంగా వున్నవాళ్లు నిజానికి చంకలు గుద్దుకోవాలి. కానీ ఆ సర్వేల్లో నిజమెంత అన్న సందేహమే ఇందుకు కారణం. సర్వే సంస్థలు ఇలా విఫలం కావడం భారతీయ సమాజంలో కొత్త కాదు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన కొద్ది నెలల్లోనే బీజేపీ ని కాదని ఢిల్లీ ఓటరు ఆప్ కి జై కొట్టాడు. ఈ విషయాన్ని ఏ సర్వే సంస్థ కనిపెట్టలేకపోయింది. ఇక తమిళనాట జయ ఓటమి ఖాయం అని సర్వే సంస్థలు కోడై కూశాయి. చివరికి ఏమి జరిగిందో అందరికీ తెలుసు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ జయకేతనం ఎగురవేస్తాడని ప్రసిద్ధ నీల్సన్ సంస్థ చెప్పింది. తర్వాత ఏమైందో చూసాం. అంతెందుకు తాజాగా ఓ జాతీయ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి 12 .5 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏంటో అందరికీ తెలుసు. అయినా రాజకీయ పార్టీలు ఈ సర్వే సంస్థల చుట్టూ తిరుగుతూనే వున్నాయి. కొన్ని పార్టీలు సొంతంగా సర్వే విభాగాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. అయినా చాలా సందర్భాల్లో బొక్కబోర్లా పడుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది ?
శాంపిల్ శాతం..:
ప్రస్తుతం సర్వేలు చేస్తున్న సంస్థలు దాదాపు అటు ఇటుగా ఒక్క శాతం శాంపిల్ తీసుకుంటున్నాయి. అంటే 100 మంది ఓటర్లలో ఒక్కరిని మాత్రమే ప్రశ్నిస్తాయి. ఆ ఒక్క శాతంలో 100 ల కొద్దీ భాషలు, వేల కొద్దీ కులాలు వున్నా సంక్లిష్ట సమాజంలో అన్ని వర్గాల వాణిని ప్రతిబింబించడం సాధ్యమా? కానే కాదు, ఉన్నది అదే దారి కాబట్టి… తప్పో ఒప్పో తెలుసుకోకుండా అదే దారిలో నడుస్తున్నారు… అదెలాగో చూద్దాం …
వెయ్యి ఓట్లున్న ఓ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుందాం.. అందులో దాదాపు 20 నుంచి 25 కులాలు వారుంటారు.. రెండు మూడు కులాలు ప్రభావ శీలంగా వ్యవహరిస్తాయి .కానీ ఆ ఊరిలో తీసే శాంపిల్ సంఖ్య 10 లోపే.. 20 కులాలున్న చోట పది శాంపిల్ తో ఫలితమెలా సజావుగా వస్తుంది? ఒకే కులంతో రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళుంటే… అప్పుడేంచేస్తారు ? 10 రెడ్డి కుటుంబాల్లో 9 వైసీపీ కి మొగ్గు చూపాయి అనుకుందాం.. ఒక్క కుటుంబ టీడీపీ తో ఉంటే… రెడ్డి కులం నుంచి తీయాల్సిన ఒక శాంపిల్, ఆ ఒక్క కుటుంబం వారిది అయితే.. ఫలితం పూర్తి రివర్స్ లో వస్తుంది కదా.? ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా అర్ధం చేసుకోకుండా సర్వేలు చేస్తున్నారు.. చేయించుకుంటున్నారు . పాశ్చాత్య సమాజాలకి భారతీయ సమాజానికి వున్నా వైరుధ్యాన్ని అర్ధం చేసుకోకుండా మూస పద్దతిలో చేస్తున్న సర్వే ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
సర్వే సిబ్బంది..:
అదే ఊరిలో పుట్టి.. అదే ఊరిలో పెరిగిన వాళ్ళు సైతం ఎన్నికల సమయంలో చాపకింద నీరులా వచ్చే మార్పుని పసిగట్టలేరు. కానీ ప్రస్తుతం సర్వే లు నిర్వహించే వాళ్ళు వినియోగించే సిబ్బందికి ఆ ఊరి దారి కూడా తెలియదు. ఇక అక్కడ రాజకీయ సంస్కృతి ఎలా తెలుస్తుంది. స్థానిక రాజకీయం మీద కనీస అవగాహన ఉంటేనే శాంపిల్ ఎక్కడ తీయాలో అర్ధం అవుతుంది. హార్వార్డ్ విశ్వవిద్యాలయం నుంచి MBA చేసి వచ్చిన వారి కన్నా ఊళ్ళో రచ్చబండ దగ్గర కూర్చునే వారికే స్థానిక రాజకీయం పై అవగాహన ఉంటుంది. కాకపోతే వారికి వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఉంటాయి కాబట్టి అభిప్రాయ సేకరణలో కాస్త ఫిల్టరింగ్ అవసరమవుతోంది. అయితే హార్వార్డ్ అభ్యర్థి కన్నా ఆ ఊరిలో పని చేసే కొన్ని కుల వృత్తుల వాళ్ళు అక్కడ సమాచారం అందించగలరు. అయితే ఈ విషయాన్ని ఏ సర్వే సంస్థలు, రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా బోల్తాపడుతున్నాయి. పదేపదే పాత చింతకాయ పద్దతిలో వెళ్లి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నాయి.
సర్వేలకు జవాబు దొరకని ప్రశ్నలు…
పైగా ప్రస్తుత విధానాల్లో సర్వే లు చాలా ప్రశ్నలకు జవాబు ఇవ్వలేవు…
1 . సర్వే ఫలితాలు ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తాయోమో కానీ పార్టీలకు అవసరమైన పరిష్కారాలు చెప్పజాలవు..
2 . సర్వే ఫలితాల కాలపరిమితి తాత్కాలికం మాత్రమే…
3 . సర్వే ఫలితాన్ని సరిచూసుకోడానికి మరో సర్వే తప్ప ఆధారం ఉండదు.దాంతో సర్వే లు, కేవలం క్వశ్చన్ బ్యాంక్స్ లా ప్రశ్నలు, జవాబులు ఇస్తున్నాయి తప్ప.. వాటి మూలమైన క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దంపట్టే టెక్స్ట్ బుక్ లు తయారుచేయలేకబోతున్నాయి.
ప్రస్తుతం అనుసరిస్తున్న సర్వే విధానాలు రూపొందించిన సెఫాలజిస్ట్ లు భారతీయ సమాజాన్ని, అందులో సంక్లిష్టతను అర్ధం చేసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా సర్వే సంస్థల ప్రధాన లక్ష్యం ప్రస్తుతం ప్రజల నాడి ఎలా వుందో తెలుసుకోవడం , రేపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం మాత్రమే. నిజానికి ఈ రెండు విషయాలు పోటీలో వున్న పార్టీలకి ఇంకాస్త అయోమయ పరిస్థితులు సృష్టించడం తప్ప ఎన్నికల్లో ఎలా గెలవాలి, ఏ వ్యూహం అనుసరించాలి అన్న దారి చూపలేవు. ఈ పరిస్థితిని అర్ధం చూసుకున్న ఓ ఔత్సాహిక బృందం ఎన్నికల ప్రక్రియ , భారతీయ సమాజంలో సంక్లిష్టత, స్థానిక నాయకుల అభిప్రాయాలు, సాంకేతికంగా ప్రపంచాన్ని కొత్తదిశగా తీసుకెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించుకుంటూ సరికొత్త టూల్ ని కనిపెట్టింది.
ఓట్రాక్ పేరుతో డోయెన్ బిజ్ అనే ఐటీ సంస్థ రూపొందించిన ఈ టూల్ ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలకు ఓ వరం కానుంది. ఓట్రాక్ తో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే పాత చింతకాయ పచ్చడి జోస్యాలు చెప్పదు. లోకల్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ఎన్నికల్లో ఎలా గెలవచ్చో చెబుతుంది. ఏ వ్యూహాలు రచించుకోవాలో చెప్పే విషయంలో చాణుక్యుడులా తోడు ఉంటుంది. మొత్తం నియోజకవర్గ పరిస్థితిని ఓ చిన్న టాబ్ ద్వారా మన కళ్ళ ముందు లైవ్ లో ఉంచుతుంది. ఓ విధంగా చెప్పాలంటే ఎన్నికల్లో నిలబడే పార్టీలకు, నాయకులకు వజ్రాయుధం లా పని చేస్తుంది. ఓట్రాక్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ టూల్ ఈ ఎన్నికల్లో సంచలనాలు సృష్టించడం ఖాయం అని డో యెన్ బిజ్ సంస్థ అంటోంది. ఆ దిశగా ఇప్పటికే కొన్ని ప్రధాన పార్టీలకు సేవలు అందించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇతర వివరాల కోసం డో యెన్ బిజ్ ఐటీ సంస్థ లో కీలక బాధ్యతలు వహిస్తూ ఆర్టిప్షియల్ ఇంటలిజెన్స్ లో దిట్ట అయిన డాక్టర్ శ్రీనివాస కిషన్ 8309517200 , జస్వీర్ సింగ్ 9999827111 లను సంప్రదించవచ్చు.