హైదరాబాద్ వాసులకు అలర్ట్. ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు ఇవాళ ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో నగరంలో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యం చేరుకోవాలని నగరవాసులను నగర అదనపు (ట్రాఫిక్) పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు కోరారు. ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-> పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు, టివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్ల మధ్య రహదారులు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
-> సికింద్రాబాద్ సంగీత్ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్ వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా, బేగంపేట వైపు మళ్లించనున్నట్లు వెల్లడించారు.
-> బేగంపేట నుంచి సంగీత్ కూడలికి వచ్చే వాహనాలను సీటీఓ ఎక్స్ రోడ్స్ వద్ద బాలంరాయ్, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉప్కార్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్ల వైపు మళ్లించనుండగా.. బోయినపల్లి, తాడ్‌బండ్ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్ బాండ్ వద్ద సీటీఓ, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.
-> కార్ఖానా, ఏబీఎస్ నుంచి ఎస్బీహెచ్-ప్యాట్ని వైపు వచ్చే ట్రాఫిక్ స్వీకార్-ఉప్కార్ వద్ద వైఎంసీఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్‌బాండ్, బాలంరాయ్, సీటీవో వైపు మళ్లాలని.. ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలకు ఎస్బీహెచ్- స్వీకార్-ఉప్కార్ వైపు అనుమతిలేదని.. క్లాక్ టవర్, వైఎంసీఏ లేదా ప్యారడైజ్, సీటీఓ వైపు పంపిస్తామని చెప్పారు