Election Updates: వైసీపీకి మరో బిగ్ షాక్‌.. జగన్‌ యాత్రకు దూరంగా ఎమ్మెల్యే..!

Election Updates: Another big shock for YCP.. MLA away from Jagan Yatra..!
Election Updates: Another big shock for YCP.. MLA away from Jagan Yatra..!

శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీకి మరో షాక్‌ తగిలింది. సీఎం జగన్‌ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు దూరంగా ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి ఉంటున్నారు. నిన్న కదిరిలో జరిగిన సిఎం జగన్ రోడ్ షోలో ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి కనపడలేదు. అయితే.. కదిరి టిక్కెట్ ఆశించి భంగపడ్డారు ఎమ్మెల్యే సిద్దారెడ్డి.

కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్దారెడ్డిని కాదని మగ్భూల్ అహ్మద్ పేరు వైసీపీ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇక టిక్కెట్ల ప్రకటన జరిగినప్పటి నుంచి పార్టీ తో అంటీముంటనట్లుగా ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి వ్యవరిస్తున్నారు. ఇక తాజాగా కదిరిలో జరిగిన సిఎం జగన్ రోడ్ షోలో కనపడలేదు ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి. దీంతో ఆయన పార్టీ మారుతారని అందరూ అంటున్నారు.