ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త. ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించారు. ఏపీలో పాఠశాలలకు ఈ నెల 24 నుంచి జూన్ 12వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్ 12 తర్వాత మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. ఇక ఎండా కాలంలో స్పెషల్ క్లాసులు లాంటివి నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవనిహెచ్చరింది ఏపీ విద్యాశాఖ.
కాగా, తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్నాయి ఎండలు. దీంతో ఏపీ, తెలంగాణకు వడగాలుల హెచ్చరికలు వాతావరణ శాఖ జారీ చేసింది. అటు ఏపీలో నేడు 37 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.