Election Updates: BRS పార్టీకి మరో షాక్‌.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యే బోథ్ !

Election Updates: Another shock for the BRS party.. MLA Both joined the Congress party!
Election Updates: Another shock for the BRS party.. MLA Both joined the Congress party!

BRS పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా దూరం కానున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కలిశారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు సమాచారం అందుతోంది.

అంతేకాదు.. బోథ్‌ ఎమ్మెల్యే టికెట్‌ కూడా రాథోడ్ బాపూరావు ఇచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన టికెట్లలో.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కు నిరాశే ఎదురైంది. ఈ సారి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు స్థానంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున అనిల్‌ జాదవ్‌ ను బరిలోకి దింపింది బీఆర్‌ఎస్‌ పార్టీ. దీంతో… బీఆర్‌ఎస్‌ పార్టీపై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలోనే.. ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారిని కలిశారు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు.