తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇక కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉంది. అధికార పార్టీ అయిన BRS ఎలాగైనా గెలిచి అధికారాన్ని నిలబెట్టుకునే యోచనక్కలో తీవ్రంగా ప్రయత్నిస్తూ ప్రచారాలతో ముందుకు వెళుతోంది. ఇక తాజాగా సీఎం కేసీఆర్ బోధన్ సభలో కాంగ్రెస్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడైనా రైతు బంధు గురించి ఆలోచించిందా ? అంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. ఇదే కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు, రైతులకు మేలును కలిగిస్తున్న ధరణిని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా వస్తాయి అంటూ కేసీఆర్ గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ రైతులకు విరుద్ధం చేసిన వ్యాఖ్యలను గుర్తుంచుకుని రానున్న ఎన్నికల్లో రైతులే ఓడించాలంటూ బోధన్ సభలో కేసీఆర్ ప్రజలను మరియు రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
మరి ఇక తీర్పు మొత్తం ప్రజలు చేతుల్లోనే ఉంది, రెండు సార్లు గెలిపించిన కేసీఆర్ నే మళ్ళీ గెలిపిస్తారా లేదా కాంగ్రెస్ కు మరో అవకాశం ఇస్తారా అన్నది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.