కాసేపటి క్రితమే కేంద్ర దర్యాప్తు సంస్థ NIA సంచలనమైన విషయాన్ని తెలియచేసింది. NIA తెలుపుతున్న సమాచారం ప్రకారం కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ మరియు గోవా రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. ఐసిస్ ఉగ్ర సంస్థ ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు పక్క సమాచారంతోనే NIA ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ఏజెన్సీ మొత్తం 7 మందిని అరెస్ట్ చేసింది. వీరిని విచారించగా బయటపడిన వాస్తవం ప్రకారం వీరు కేవలం ముస్లిమేతరులు లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన పథకం రచించినట్లు చెప్పారు.
ఉగ్రవాదులు వాట్సాప్ గ్రూప్ లలోనూ సమాచారాన్ని షేర్ చేసుకుంటూ ప్లాన్ లు చేస్తున్నారట. వీరు విదేశీయులతోనూ టచ్ లో ఉంటూ ఈ పథకాలకు ఉసిగొల్పుతున్నారని NIA తెలిపినది. కాగా వరల్డ్ కప్ జరుగుతుండడంతో ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే టెర్రర్ సృష్టిస్తామని ప్రకటించి అలజడి రేపాయి. కానీ ప్రశాంతంగా వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంది.