Election Updates: రైతుల పాలిట బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు శత్రువులు: హరీశ్ రావు

Election Updates: Farmers ruled by BJP, Congress parties are enemies: Harish Rao
Election Updates: Farmers ruled by BJP, Congress parties are enemies: Harish Rao

బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మరోసారి ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న బీజేపీకి ఓట్లడిగే అర్హత లేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ మంగళవారం రోజున రాష్ట్రంలో పర్యటించి చేసిన వ్యాఖ్యలను బట్టి కేసీఆర్‌ రైతు పక్షపాతి అని అర్థమయ్యిందని హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

“మోటార్లకు మీటర్లు పెట్టనందునే రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని నిర్మల సీతారామన్‌ చెప్పారు. రూ.25 వేల కోట్లు నష్టపోతాం అని తెలిసినా కేసీఆర్‌ మోటార్లకు మీటర్లు పెట్టలేదు. 65 లక్షల మంది రైతుల ప్రయోజనాల దృష్ట్యా మోటార్లకు కేసీఆర్‌ మీటర్లు పెట్టలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో సైతం మోటార్లకు మీటర్లు పెట్టాయి. ఒకవేళ కాంగ్రెస్‌ గెలిస్తే రైతుల మోటార్లకు మీటర్లు పెడతారు. కర్ణాటకలో 5 గంటలే కరెంట్‌ ఇస్తున్నామని డీకే శివకుమార్‌ చెప్పారు. 24 గంటల నాణ్యమైన కరెంట్‌ కావాలంటే బీఆర్ఎస్​కు ఓటు వేయాలి. రైతుల పాలిట బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు శత్రువులు.