Election Updates: సీఎం జగన్ వస్తే.. గొడ్డలికి పని ఉండాల్సిందేనా..?

Election Updates: If CM Jagan comes...does the ax have work?
Election Updates: If CM Jagan comes...does the ax have work?

సీఎం జగన్ వస్తున్నారంటే చాలు.. ఆయన పర్యటించే మార్గంలో పచ్చని చెట్లపై వేటు పడుతోంది. ఈ నెల 13న విజయవాడలో జగన్ బస్సు యాత్ర ఉంది. దీంతో అధికారులు శుక్రవారం ఆ మార్గాల్లో చెట్ల కొమ్మలను నరికివేయిస్తున్నారు. తొలుత నగరపాలక సిబ్బంది చెట్ల కొమ్మలు కొట్టేందుకు చూసినా.. అధికారులు అడ్డుకున్నారు.

సాయంత్రం ఏమైందో ఏమోగానీ సత్య నారాయణపురం, ముత్యాలం పాడు, అజిత్సింగ్నగర్లోని కృష్ణా హోటల్ కూడలిలో వారే కొట్టేయించారు. వైకాపా నాయకుల ఒత్తిడి కారణంగానే చెట్లపై గొడ్డలి వేటు వేశారని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లో కొద్ది రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారు.