తెలంగాణ రాష్ట్ర సీఎం రేసులో ఉన్న జానారెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. జానారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించారు ఎన్నికల అధికారులు. నవంబర్ మూడవ తేదీన ప్రారంభమైన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇటీవల ముగిసింది. దీంతో పలువురి నామినేషన్ల ను పరిశీలన చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో కొంతమంది నామినేషన్లు తిరస్కరించబడుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గ నుంచి వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది.
వాస్తవానికి ఆయన తనయుడు జైవీర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలువురి నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 నామినేషన్లు, మానకొండూరు నియోజకవర్గం లో 7, అలాగే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి 3 నామినేషన్లు తిరస్కరించారు. ఇటు ఈటెల రాజేందర్ భార్య ఈటల జమున నామినేషన్ కూడా తిరస్కరించారు ఎన్నికల అధికారులు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 600 వరకు నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారట.