తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ పార్టీల నేతలు తమదైన శైలీలో ప్రచారాన్ని చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, డీ.కే.శివకుమార్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ, సిద్దరామయ్య, బీజేపీ నుంచి ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలతో పాటు పలువురు కేంద్రమంత్రులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
తాజాగా జగిత్యాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల ప్రజలకు ఓ బాండ్ పేపర్ రాసిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే జగిత్యాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని బాండ్ పేపర్లో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులకు పవిత్రమైన కార్తీక మాసం రోజున ఈ బాండ్ పేపర్ రాసిస్తున్నానని ఈరోజు ఏం చేసినా శుభమే జరుగుతుందని తాను గెలిచి హామీలు నెరవేర్చకపోతే ప్రజలు నా తనను నిలదీయవచ్చని జీవన్ రెడ్డి తెలిపారు.