కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ ఏటీఎంలా పని చేసిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్లిన రాహుల్, భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో మహిళా ఆత్మీయ సమ్మేళనంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ విమర్శించారు.
‘తెలంగాణ సంపద దోపిడికి గురవుతోంది. కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తాం. దోరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. BRS, BJP, MIM… మూడు ఒకటే’ అని రాహుల్ విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టు బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంల మారిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని కల్లారా చూద్దామని, లక్షల కోట్ల ప్రజాధనం వృధా అయిందని, దాన్ని ప్రజలకు వివరిద్దామని తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును చూసేందుకు తరలి వెళ్లారు. అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టును చూసి.. హైదరాబాద్ వెళ్లి పోయారు రాహుల్ గాంధీ.